SNP
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సెంచరీల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదంతా టైమ్ వేస్ట్ అంటూ పేర్కొన్నాడు. అయితే పాండ్యా ఈ వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేశాడో అని అభిమానులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సెంచరీల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదంతా టైమ్ వేస్ట్ అంటూ పేర్కొన్నాడు. అయితే పాండ్యా ఈ వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేశాడో అని అభిమానులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మధ్యలోనే తప్పుకున్న పాండ్యా.. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరఫున ఆడలేదు. తిరిగి నేరుగా ఐపీఎల్‌లోనే బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే పాండ్యా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది కూడా సెంచరీలు, హాఫ్ సెంచరీల విషయంలో. ఇంతకీ పాండ్యా ఏమన్నాడంటే.. ‘నా దృష్టిలో హాఫ్ సెంచరీలు, సెంచరీలు కేవలం నంబర్లు అంతే.. అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్’ అంటూ పేర్కొన్నాడు. పాండ్యా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఎవర్ని ఉద్దేశించి పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడు? అనే కోణంలో క్రికెట్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించే పాండ్యా ఈ కామెంట్స్ చేసి ఉంటాడనే వాదన కూడా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. ఓవరాల్‌గా సచిన్ వంద సెంచరీల రికార్డుపై కన్నేశాడు. అలాగే రోహిత్ శర్మ కూడా సెంచరీల మార్క్‌ను ప్రతిష్టాత్మకం తీసుకున్నాడు. ఇలా టీమ్‌లోని ఇద్దరు స్టార్ క్రికెటర్లు సెంచరీల్లో రికార్డులు సాధిస్తుంటే.. ఎక్కడో లోయర్‌ఆర్డర్‌లో ఆల్‌రౌండర్‌గా ఆడే పాండ్యాకు సెంచరీలపై ఇలాంటి కామెంట్ చేసే అవసరం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓ ఆటగాడు సెంచరీ చేస్తే.. అతని కాన్ఫిడెన్స్ ఎంత బిల్డ్ అవుతుందో పాండ్యాకే ఏం తెలుసని ఎద్దేవా చేస్తున్నారు.
పాండ్యాకు ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఒకే ఒక్క సెంచరీ ఉంది. పైగా అతనిపై సెంచరీలు చేయాలని ఒత్తిడి కూడా ఉండదు. పాండ్యా నుంచి ఎవరూ కూడా సెంచరీలు ఆశించడం లేదు కదా.. అతనెందుకు సెంచరీలను అంత ఈజీగా తీసేసి పడేసినట్లు మాట్లాడాతున్నాడు అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా, గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన పాండ్యా.. రానున్న సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గుజరాత్ నుంచి ఇంటర్నల్ ట్రెడింగ్ ద్వారా ముంబైకి వచ్చిన పాండ్యాకు.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించి అతనికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మరి సెంచరీలు జస్ట్ నంబర్, టైమ్ వేస్ట్ అంటూ పాండ్యా చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hardik Pandya said, “I generally don’t believe in the fifties or hundreds. Stats are just numbers to me, a waste of time”. (Star Sports). pic.twitter.com/FMAkvMO48S
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024