Swetha
కొన్ని వారాలుగా ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు ఓటీటీ లో పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ ఎటువంటి హడావిడి లేకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోకి అడుగుపెట్టేసింది. ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.
కొన్ని వారాలుగా ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు ఓటీటీ లో పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ ఎటువంటి హడావిడి లేకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోకి అడుగుపెట్టేసింది. ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.
Swetha
ఓటీటీ లో సినిమాలంటే ఇప్పుడు అందరికి ఆసక్తి బాగా పెరుగుతుంది. అందులోను, క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ పైనే అందరి దృష్టి పడుతుంది. దీనితో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో మరో క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ లోకి అడుగుపెడుతుంది. అది కూడా ఎటువంటి ప్రకటన లేకుండా. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. తెలుగులో రాజా రాజా చోర సినిమా ఫేమ్ సునైన నటించిన “రెజీనా”మూవీ. అయితే, ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వలన తమిళ వెర్షన్ తో సరిపెట్టేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
అయితే , ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోను ఒకేసారి విడుదల చేయాలనీ భావించారు. దీనికోసం టాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ, విడుదల సమయానికి టాలీవుడ్ లో థియేటర్స్ దొరకలేదు. దీనితో ..రెజీనా తెలుగు వెర్షన్ రిలీజ్ కు బ్రేక్ పడింది. దీనితో కేవలం తమిళ వెర్షన్ తోనే థియేటర్స్ లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికొస్తే.. ఆల్రెడీ ఈ సినిమా తమిళ వెర్షన్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత ఓటీటీలో తెలుగు వెర్షన్ ను కూడా విడుదల చేశారు. సో ప్రస్తుతం “రెజీనా” మూవీ తెలుగు వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. తన భర్త ఆకస్మిక మరణంపై ఓ మహిళ ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అనేదే కథ. ఇదొక మంచి రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునైన నటనను ప్రత్యేకించి ప్రశంసలు దక్కాయి. అలాగే మిగిలిన నటి నటులు కూడా తమ వంతు న్యాయం చేశారు. అయితే, కథలోని ట్విస్ట్ లు కాస్త ఈజీగా గెస్ చేసే విధంగా ఉండడంతో .. అక్కడక్కడ సస్పెన్స్ మిస్ అవుతుంది. కానీ, క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మాత్రం ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మరి, “రెజీనా” ససినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Telugu version of Tamil film #Regina (2023) by @domin_dsilva, ft. @TheSunainaa @AnanthNag24 @actorvivekpra @actor_saideena & @writerbava, now streaming on @PrimeVideoIN.@SathishNair20 @YugabhaarathiYb @telugufilmnagar @yellowbearprod @JungleeMusicSTH pic.twitter.com/LqN8WCOM5I
— CinemaRare (@CinemaRareIN) February 22, 2024