OTT News: అనంత పద్మనాభ స్వామి ఆలయంపై డాక్యుమెంటరీ.. ఫ్రీగా చూసేయండి!

అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు ఈ ఆలయం గురించి ఏకంగా ఓ డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు ఈ ఆలయం గురించి ఏకంగా ఓ డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఆలయం గురించి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఈ ఆలయంలో బయటపడిన ఆరు గదులలోని.. సిరి సంపదలతో.. అప్పటివరకు అత్యున్న సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమలను కూడా .. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడిన సంపద వెనుక్కు నెట్టేసిన సంగతి కూడా తెలిసిందే. శ్రీ మహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో అత్యంత ముఖ్యమైన క్షేత్రం.. తిరువనంతపురంలోని .. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పటికే అందరికి కొంత అవగాహనా ఉండి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఆలయం గురించి “ఒనవిల్లు: ది డివైన్ బో” పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. మరి ఈ డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుంది ! ఏ ఓటీటీ లో అందుబాటులో ఉంది! అనే విషయాలను చూద్దాం.

తిరువనంతపురంలోని మూవీ నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్ లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. అయితే, ఈ డాక్యుమెంటరీకి “ఒనవిల్లు: ది డివైన్ బో” అని పేరు పెట్టడం వెనుక కూడా పెద్ద రహస్యమే దాగి ఉంది. ఓనవిల్లు అంటే సాధారణంగా పద్మనాభస్వామి వారికి ఉత్సవ సమయాల్లో .. ఉత్సవ విల్లును సమర్పిస్తారు. దీనిని త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సాంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. కాబట్టి వీరిని “ఒన్వవిల్లు కుటుంబం” అంటారు. ఈ వంశీయులు గత ఏడు తరాలుగా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. ఇక తరతరాల నుంచి వచ్చిన ఈ సాంప్రదాయ ఆచార వ్యవహారాల గురించి.. తీసిన డాక్యుమెంటరీనే ఈ “ఒనవిల్లు: ది డివైన్ బో”. ఇక దీనిలో మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ముకుందన్లు వాయిస్ ఓవర్ అందించారు. ప్రస్తుతం ఈ డాక్యూమెంటరీ మార్చి 8నుంచి.. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ కేవలం మలయాళ భాషల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడిన ఆరు గదులలో .. ఇప్పటివరకు ఐదు గదులను మాత్రమే తెరిచారు. ఈ ఐదు గదులలో బయట పడిన సంపద ఇప్పటివరకు .. సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటివరకు ఈ అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులకుగా ఉంటున్నారు. అయితే, ఆ ఆలయంలో ఉన్న ఐదు గదులు తెరిచినప్పటికీ.. ఆరవ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో ఆ గదిని తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆ గదిలో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి అనేది.. ఎవరికీ ఎప్పటికి అంతు చిక్కని రహస్యం. మరి ఈ ఆలయం గురించి వచ్చిన “ఒనవిల్లు: ది డివైన్ బో” డాక్యుమెంటరీ ఓటీటీ స్ట్రీమింగ్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments