OTT News: OTTలోకి వచ్చేసిన అనన్య రొమాంటిక్ థ్రిల్లర్

ఓటీటీలలో సినిమాల సందడి రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. అందులోను మరి ముఖ్యంగా హర్రర్ సినిమాలు చూసేవారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో హర్రర్ సినిమా ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలలో సినిమాల సందడి రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. అందులోను మరి ముఖ్యంగా హర్రర్ సినిమాలు చూసేవారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో హర్రర్ సినిమా ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ లో సినిమాలు అనగానే ఈ మధ్య అందరికి హర్రర్ ,సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ ఏ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా హర్రర్ సినిమాలను థియేటర్ లో చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలని అనుకునే వారు ఉంటారు. అలాగే ఒంటరిగా చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలని అనుకునే వారు ఉంటారు. ఈ క్రమంలోనే ఓటీటీలో హర్రర్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా తెలుగులో ఎప్పటికప్పుడు బెస్ట్ హర్రర్ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అలా గత ఏడాది థియేటర్ లో రిలీజ్ అయినా ఓ హర్రర్ చిత్రం .. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనన్య నాగళ్ళ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా “అన్వేషి”. విజయ్ ధరణ్ , సిమ్రన్ గుప్తా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే కొన్ని సినిమాలలో ఎంత కంటెంట్ ఉన్నా కూడా స్టార్స్ లేకుంటే మాత్రం ఎందుకో ఆ సినిమాలు .. వెనుకపడిపోతూ ఉంటాయి. అన్వేషి సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పండింది. కథ పరంగా ఈ సినిమా అందరికి నచ్చినప్పటికీ.. స్టార్స్ లేకపోవడంతో.. ఈ సినిమాను అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే, అన్వేషి సినిమా కథ విషయానికొస్తే.. విక్రమ్(విజయ్ ధరణ్), అను (సిమ్రాన్ గుప్తా).. తొలి చూపులోనే ప్రేమలో పడిపోతారు. ఆ హీరోయిన్ ను వెతుక్కుంటూ.. మారేడుకొన అనే ఊరికి వెళ్తాడు. అయితే, అదే టైమ్ లో ఆ ఊరిలో వరుసగా హత్యలు జరుగుతాయి. అది కూడా పాత పడిన ఓ హాస్పిటల్ ఎదురుగ జరుగుతూ ఉంటాయి. అయితే, ఆ హత్యలన్ని చనిపోయిన డాక్టర్ అను( అనన్య ) నే చేస్తుందని ఊరి జనం అంత నమ్ముతారు. ఈ క్రమంలో హీరో ఆ హత్యల వెనుక ఉన్న అసలు నిజాలను ఎలా బయటపెడతాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments