Idream media
Idream media
దేశంలో మోడీ మానియా తగ్గుతోందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఇండియా టుడే సర్వే కూడా మోడీ గ్రాఫ్ తగ్గినట్లు పేర్కొంది. ప్రత్యర్థి పవర్ తగ్గుతుందంటే.. ఆ చాన్స్ అందిపుచ్చుకుని దేశంలో ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాలి. మరి ఆ పార్టీ ఏం చేస్తోంది. ఆ దిశగా కార్యచారణ ప్రారంభించిందా, తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యులతో వర్చువల్ గా సమావేశమైంది. పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చిందని పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని సూచనలు చేసింది. దాని అర్థం ఏంటి, తెరపైకి మళ్లీ థర్డ్ ఫ్రంట్ వస్తుందా..? అనే చర్చ సాగుతోంది.
ఏడేళ్లుగా మోడీ తిరుగులేని నాయకుడిగా కొనసాగారు. మొదటి ఐదేళ్లు చేసిన పాలనపై నమ్మకం ఉన్న ప్రజలు మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టారు. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన వెంటనే ఆయన స్ట్రాటజీ తగ్గిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ తన పవర్ చూపేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతోంది. ప్రత్యేకంగా కొన్ని లక్ష్యాలను ముందుంచి వాటిని పూర్తి చేయడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
వచ్చే ఎనికల్లో ఎన్డయే కూటమిని ఎలాగైనా ఓడించే లక్ష్యాన్ని పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకు ఒంటరిగా కాకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఒంటరిగా కాకుండ కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రతిపక్ష నాయకులందరినీ కలుపుకకుపోతున్నారు. ఇటీవల ఆ పా్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలన్నింటికి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొందరితో ఎప్పుడూ టచ్లో ఉంటున్నారు. ఒక్కోసారి మెట్టు దిగి కొందరు చెబుతున్న సూచనలు పాటిస్తున్నారు.
ఇటీవల వర్చువల్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతిపక్షాలన్నీ శరత్ పవార్ తో సహా ప్రతిపక్ష నాయకులందరూ హాజరయ్యారు. కానీ ఆప్ అకాలీదళ్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఇప్పటికే కమలం పార్టీపై వస్తున్న వ్యతిరేకతను అస్త్రాలుగా చేసుకొని వాటితో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రైతు చట్టాలు కోవిడ్ వైఫల్యం పెగాసస్ వివాదం వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని బీజేపీపై పోరాటం చేయనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 సీట్లలో కాంగ్రెస్ కనీసం 136 సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. మిగిలిన సీట్లు బీజేపీ గెలుచుకున్నా టార్గెట్ రీచ్ కావాలని చూస్తోంది.
గత ఎన్నికల ముందు కూడా మమతా బెనర్జీ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సాగాయి. జనవరిలో కోల్ కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి 22 పార్టీల నేతలు హాజరయ్యారు. కానీ రెండోసారి కూడా ఎన్టీయేనే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి థర్డ్ ఫ్రంట్ సమావేశాలు జరగలేదు. కానీ తాజాగా మరోసారి థర్డ్ ఫ్రంట్ తెరపైకి వస్తోంది. అదీ కాగా రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ కూటమికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. గతంలో కూడా మోడీపై ఈ తరహా ప్రచారం జరిగినప్పుడు అతి తక్కువ కాలంలోనే ఆయన మళ్లీ ప్రజాదరణ పొందగలిగారు. అటువంటిది మరోసారి జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ లో ఇప్పుడున్న జోష్ సరిపోదు. దీన్ని బట్టి మున్ముందు వ్యూహాలకు మరింత పదునుబెడుతుందా చూడాలి.