ఐఎఎస్ లకు కోర్టు శిక్ష విధించిన ఘటనలో పాపం ఎవరిది ?

ఎవరి హయాంలో తనకు అన్యాయం జరిగిందని తాళ్ళపాక సావిత్రమ్మ కోర్టుని ఆశ్రయించింది? . తనకు పరిహారం ఎవరి హయాంలో అందింది ?

2017 లో పరిహారం చెల్లించమన్న కోర్టు తీర్పుని బేఖాతరు చేసింది చంద్రబాబా? జగన్మోహన్ రెడ్డి నా?

కేసు విచారణ కాలంలో ఏ ప్రభుత్వ హయాంలో అధికారులకు బాధ్యులుగా శిక్ష పడింది? ఏ ప్రభుత్వ హయాంలో అధికారులకు శిక్ష నుండి మినహాయింపు లభించింది ?

ఏమి జరిగింది?
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ దివ్యాoగుల నైపుణ్యాభివృద్ది సంస్థ విజ్ఞప్తి మేరకు నెల్లూరు జిల్లా చవటపాలెం పంచాయితీ పరిధిలో 2016 లో పది ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది నాటి టీడీపీ ప్రభుత్వం . అయితే కేటాయించి హద్దులు నిర్ణయించిన అసైన్డ్ భూమిలో సర్వే నెంబర్ 943 లో ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిన భూమి కూడా కలిపేసారని అదే గ్రామానికి చెందిన తాళ్ళపాక సావిత్రమ్మ అనే మహిళ రెవిన్యూ అధికారులకు విన్నవించుకొంది .

Also Read:మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ముగ్గురు సోదరులు .. మూడు పార్టీలు

ఇదే విషయంగా పలుమార్లు రెవిన్యూ అధికారులకు విన్నవించుకొన్నా ఫలితం లేకపోవడంతో లోకాయుక్తలో పిర్యాదు చేసిన సావిత్రమ్మ తర్వాత హై కోర్టులో కేసు దాఖలు చేసింది . పూర్వాపరాలు విచారణ తరువాత సావిత్రమ్మకి ఎకరాకు పదమూడు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిందిగా 2017 లో హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది . నాటి ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు పరిహారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 2018 లో మరలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సావిత్రమ్మ .

కోర్టు ఆదేశాలు ఎప్పుడు ఇచ్చింది?

ఈ కేసుకు సంబంధించి ఈ నెల 2 వ తారీఖు గురువారం తీర్పు వెలువరించిన రాష్ట్ర హై కోర్ట్ కేసు తొలి తీర్పు వెలువడిన 2017 సంవత్సరం నుండి తుది తీర్పు వెలువడిన నిన్నటి వరకూ నాలుగేళ్ళ కాలంలో పని చేసిన ఐఏఎస్ ల నిర్లక్ష్యంగా పరిగణించి ఆ కాలంలో నెల్లూరు కలెక్టర్లగా పని చేసిన ముత్యాల రాజు , శేషగిరీలకు వారం రోజుల జైలు శిక్ష , రూ. 1000 చొప్పున జరిమానా , సిసిఎల్ఏ , ప్రిన్సిపల్ సెక్రటరీ లుగా విధులు నిర్వహించిన మన్మోహన్ సింగ్ , రావత్ లకు నెల రోజుల జైలు శిక్ష , రూ .1000 చొప్పున జరిమానా విధించింది రాష్ట్ర హై కోర్టు .

2017 లో కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత అధికారులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చెల్లింపు విషయంలో నాటి టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అధికారులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది . వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కోర్టు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రభుత్వం దృష్టికి రాగా గత ఆర్థిక సంవత్సరంలో సావిత్రమ్మకి చెందాల్సిన పరిహారం ఆమె ఖాతాకి జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం . ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కలెక్టర్ చక్రధర్ బాబును , ఇతర అధికారులను శిక్ష పరిధి నుండి మినహాయించింది రాష్ట్ర హై కోర్ట్ .

Also Read:ఢిల్లీలో బయటపడిన అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగంలో ఏముంది…?

పాక్షిక కథనాలు ఎందుకు?

కేసు పూర్వాపరాలు ఇలా ఉండగా కొన్ని పత్రికలు , చానెళ్లు మాత్రం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరు వలనే ఉన్నత స్థాయి అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని , గత రెండేళ్లలో ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాల వలన అధికారులు శిక్షలకు గురయ్యారని వక్రీకరించడం బాధాకరం . నాడు కోర్టు తీర్పుని అధికారులు టీడీపీ ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా బాధితురాలికి పరిహారం చెల్లించకపోవడం వలనే నలుగురు ఐఏఎస్ అధికారులకు శిక్షలు ఖరారు కాగా , వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారులు ఈ అంశాన్ని మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా తగు చర్యలు తీసుకొని పరిహారం బాధితురాలి ఖాతాలో జమ చేయటం వలనే ప్రస్తుత జిల్లా కలెక్టర్ తో పాటు , ఇతర ఐఏఎస్ అధికారులు ఏ విధమైన చర్యలకు గురికాక మినహాయించబడ్డారన్న వాస్తవాన్ని వక్రీకరించి శిక్షలు పడ్డ కాలంలో ఉన్న ప్రభుత్వం పై నిందలు వేయడం దురుద్దేశ్యపూరకం మాత్రమే కాక గౌరవ హై కోర్ట్ తీర్పుని వక్రీకరించడం కూడా.

గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా?

పరిహారానికి అర్హులైన బాధితుల పట్ల టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఒక్క ఘటనకే పరిమితం కాదు . పరిహారం చెల్లింపు విషయంగా కోర్టు తీర్పులని బేఖాతరు చేయడం టీడీపీకి కొత్త కాదు . 1997 సంవత్సరంలో అనురాధ అనే విద్యార్థిని పై సహ విద్యార్థి చేసిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి పాక్షికంగా అంధురాలు కాగా చికిత్సా సమయంలో దాదాపు ఇరవై పైగా సర్జరీలు చేయాల్సి వచ్చింది . నాడు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టుని ఆశ్రయించగా ఆమెకు పరిహారం అందించమన్న కోర్టు తీర్పుని పై కోర్టులో సవాల్ చేశారు కానీ బాధితురాలి పట్ల కనీస మానవత్వం చూపడం కానీ , కోర్టు ఆదేశాల్ని గౌరవించడం కానీ చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం .

Also Read:ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు..?

ఇవేవీ రాయని కొన్ని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు టీడీపీ హయాంలో జరిగిన తప్పులు , వాటి పై కోర్టు తీసుకొన్న చర్యలని ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదిస్తూ తీర్పులను వక్రీకరించడం గమనార్హం .

Show comments