Idream media
Idream media
హీరో అంటే కొంచెం మంచితనం, ఉదాత్తత, క్యారెక్టర్ ఉండాలనేవి పాత రోజులు. హీరోకి క్యారెక్టరే అవసరం లేదు. రాజరాజచోర సినిమాలో చెప్పింది ఇది. చివర్లో మారినట్టు చూపించిన సినిమా మొత్తమ్మీద ఏ క్యారెక్టర్ లేకుండా, చేసిన పనులకి గిల్టీనెస్ కూడా లేకుండా వుంటాడు. జిరాక్స్ షాప్‌లో డబ్బులు కొట్టేస్తాడు. పేపర్ లీక్ చేస్తాడు. సాప్ట్‌వేర్ అని నమ్మించి అమ్మాయితో ఎఫైర్ నడుపుతాడు. రాత్రి పూట దొంగతనాలు చేస్తాడు. పట్టుబడిన తర్వాత భార్య ఏదో పిచ్చి లాజిక్ తెలివితేటలతో తప్పిస్తే రిలాక్స్ అవుతాడు. మళ్లీ దొంగతనాలు చేస్తాడు. ఎవరో తాగుబోతు ముసల్ది చెప్పిందని కిరీటం , భుజకీర్తులు పెట్టుకుని మరీ దొంగతనానికి వెళ్తాడు. సినిమా మొత్తం మీద అతడిలో ఏ మంచి గుణమూ వుండదు. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ ప్రధాన లక్షణం ఇదేనని దర్శకుడు చెప్పదలచుకుంటే ఇది మంచి పాయింటే. అలా కాకుండా ఏదో స్క్రీన్‌ప్లే కొంచెం బాగా రాసుకుని , ట్విస్టులు పెట్టి సినిమాని ఏదో బయట పడేశాడు.
ఎందుకంటే అన్ని పాత్రలు సొంత ఆలోచనలతో కాకుండా దర్శకుడి అనుకూలత కోసమే ప్రవర్తిస్తూ వుంటాయి. అర్ధనగ్నంగా SI రవిబాబు అక్రమ సంబంధం అమ్మాయి దొరికితే ఏ భర్త అయిన అప్పుడే గొడవ పెట్టుకుని తంతాడు. అలా కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మనల్ని ఉంచి , మనం టీ తాగి వచ్చిన తర్వాత నింపాదిగా స్టేషన్‌కు వెళ్లి నా ఇంటికి రాత్రి ఎందుకొచ్చావురా అని అడుగుతాడు ఆ వెర్రి మొగుడు. భార్యని ఏమి అడిగాడో తెలియదు. ఆ అమ్మాయి ఆ తర్వాత కూడా భర్త క్యాంప్‌కి వెళ్లినప్పుడు రవిబాబుని ఇంటికి పిలుస్తూనే వుంటుంది. ఈ సారి రవిబాబు కిరీటం ధరించి మరీ ఆ ఇంటికి వెళ్తాడు.
ఈ సీన్స్ అన్నీ మూర్ఖంగా హీరో కోసమే జరుగుతూ వుంటాయి. కిరీటం ధరించి ఒకసారి దొరికిపోయిన తర్వాత కూడా SI మాటలు విని మళ్లీ అవే ధరించి దొంగతనాలకి వెళ్తాడు. క్యారెక్టర్ లేదు సరే, బుద్ధి ఏమైంది?
సినిమాలో అందరూ మోసం మనుషులే కావడం ప్లస్ పాయింటేమో! నిజానికి క్యారెక్టర్ గురించి సొసైటీలో ఎవరూ మాట్లాడ్డం లేదు. అందరికీ పర్పనాలిటీ డెవలప్ కావాలి. వ్యక్తిత్వ వికాసం అంటే మాయ మాటలు చెప్పి ప్రాడెక్ట్‌ని అమ్మడం. లేనిపోనివన్నీ చెప్పి నమ్మించి ఆఖరున షరతులు వర్తిస్తాయని బోల్తా కొట్టించడం.మార్కెట్ మాయాజాలంతో వంచించడమే ఇప్పుడు క్యారెక్టర్.
ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు అందరూ బాగా నటించారు. ఏమీలేని డొల్ల సినిమా అయినా ప్రేక్షకుల రెస్పాన్స్ బాగానే వుందంటే వాళ్లకు కావాల్సింది కూడా అదేనేమో!
Also Read: రాజరాజ చోర రివ్యూ