Municipal Polls – మినీ పోరు మామూలుగా లేదుగా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిన్న జ‌రిగిన ఎన్నిక‌లు కేవ‌లం మిగిలిపోయిన మునిసిపాలిటీల‌కు. అవి కూడా ఎన్నో ఇప్ప‌టికే అంద‌రికీ తెలుసు. 12 మునిసిపాలిటీలు, ఓ కార్పొరేష‌న్. పోలింగ్ రోజున మీడియాలోను, పోలింగ్ కేంద్రాల వ‌ద్ద జ‌రిగిన హ‌డావిడి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పించింది. సీఎం సీటు కోసం పోలింగ్ జ‌రుగుతున్నంత‌గా రాష్ట్రంలోనే కాకుండా, ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు, నేత‌లు కూడా ఏం జ‌రుగుతుందా అని ఏపీ వార్త‌ల స‌మ‌యంలో టీవీల‌కు అతుక్కుపోయారు. ఏకంగా చంద్ర‌బాబునాయుడు మీడియా ముందుకు వ‌చ్చి దొంగ ఓట్లు వేసేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఎన్నిక‌ల్లో ఘోచేశారు‌రిగిపోతున్నాయంటూ వీడియోలు చూపుతూ హ‌డావిడి చేశారు. ఇదేంటి కేవ‌లం 12 మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుంటే ఇంత‌లా రియాక్ష‌న్ అవుతున్నారేంట‌ని అంద‌రూ నోళ్లు వెల్ల‌బెట్టారు. అలా అనుకుంటార‌ని చంద్ర‌బాబు ముందే ఊహించిన‌ట్లు ఉన్నారు.. అందుకే మా ఈ పోరాటం మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం కాద‌ని, రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

కొద్ది నెలల క్రితం రాష్ట్రమంతా జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కానీ మినీ సంగ్రామంలో భాగంగా జ‌రిగిన నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీల పోలింగ్ మాత్రం మామూలుగా జ‌ర‌గ‌లేదు. మొత్తం 353 స్థానాల్లో 28 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతావాటికి పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొద‌లుకావ‌డంతో పాటు టీడీపీ నేత‌ల హ‌డావిడి కూడా మొద‌లైంది. అన్యాయం జ‌రిగిపోతుందంటూ మైకుల ముందుకు వ‌చ్చేశారు. ఎస్ ఈసీకి కూడా ఫిర్యాదు చేసేశారు. ఇలా ఫిర్యాదులు, తోపులాటల మ‌ధ్యే మొత్తం 8 లక్షల 62వేల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని స్థానాలకు కలిపి 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Also Read : Fack Votes, Chandrababu Naidu, Kuppam – ఆడలేక మద్దెల వోడు..ప్రతి ఎన్నికల్లోనూ బాబు ఎత్తుగడ

కుప్పంలో తొలి నుంచి టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ సాగుతూనే ఉంది. ఏదో జ‌రిగిపోతుందంటూ అక్కడ పోలింగ్ ముందు నుంచే టీడీపీ సోష‌ల్ మీడియా ఓ రేంజ్ లో ప్ర‌చారం సాగించింది. ఇక పోలింగ్ రోజున చంద్ర‌బాబు, ఎల్లో మీడియా చేసిన హ‌డావిడి అంద‌రూ చూసే ఉంటారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కుప్పంలో బయట వ్యక్తులు వచ్చారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అంత‌టితో ఆగ‌కుండా ఓట్లు వేసేందుకు వ‌చ్చిన మహిళలను ప్ర‌శ్న‌ల‌తో భ‌యాందోళ‌న‌కు గురి చేశారు. ఒక్క వార్డు ఏక‌గ్రీవంతో మిగిలిన ఇర‌వై నాలుగు వార్డుల‌కు జ‌రిగిన కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఆద్యంతం ర‌స‌వత్త‌రంగా సాగాయి.

నెల్లూరులో కార్పొరేష‌న్ లో కూడా అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజంపేటలో పోలీసులకు – టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, టీడీపీ, జనసేన కలిసినా వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఏళ్ల తరబడి చంద్రబాబు చేతుల్లో కుప్పం మగ్గిపోయిందని.. బయట ఓటర్లను తీసుకొచ్చిన అలవాటు చంద్రబాబుకు ఉంద‌న్నారు. వైసీపీకి ఆ అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read : AP Municipal Election, Polling Completed – నెల్లూరులో తక్కువ.. కుప్పంలో ఎక్కువ..

Show comments