MLC Elections, Sajjala, YCP Candidates – స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు… 11 మంది వైసీపీ అభ్యర్థులు వీరే..

స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ సిద్ధమైంది. నోటిఫికేషన్‌ రాక ముందే.. ఆ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతున్న తరుణంలో.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

మొత్తం 8 జిల్లాలలో 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి జగన్‌ పెద్దపీట వేశారు. అందులోనూ అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు వచ్చేలా అభ్యర్థులను ఎంపిక చేశారు.

Also Read : Rampachodavaram, Ananta Babu, MLC Seat – ఉదయ్‌ భాస్కర్‌కు ఎమ్మెల్సీ ఖాయమేనా..?

విజయనరం జిల్లా నుంచి క్షత్రియ సామాజికవర్గానికి చెందిన రఘురాజును ఎంపిక చేశారు. విశాఖ జిల్లాలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించారు. వరుది కళ్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌లకు అభ్యర్థిత్వం దక్కింది.

తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అనంత ఉదయ్‌భాస్కర్‌కు అవకాశం లభించింది. కృష్ణా జిల్లా నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన తలశిల రఘురాం, మాదిగ సామాజికవర్గానికి చెందిన మొండితోక అరుణ్ కుమార్ లకు అవకాశం దక్కింది.

గుంటూరులోని రెండు స్థానాలను కాపు, బీసీలకు కేటాయించారు. సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు మరోసారి అవకాశం లభించింది. మంగళగిరికి చెందిన బీసీ నేత, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును ఎంపిక చేశారు. ఈయన ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

Also Read : YCP, MLC Elections, Tumati Madhava Rao – తుమాటి మాధవరావుకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా..?

ప్రకాశం జిల్లాలోని ఏకైక స్థానాన్ని కమ్మ సామాజికవర్గానికి చెందిన తూమాటి మాధవరావుకు కేటాయించారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పుం కో ఆర్డినేటర్‌ భరత్‌ను ఎంపిక చేశారు. అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డికి అవకాశం కల్పించారు.

ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతోంది. డిసెంబర్‌ 10వ తేదీన పోలింగ్, 14వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి తిరుగులేని మెజారిటీ ఉన్న నేపథ్యంలో… అన్ని స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకోబోతోంది.

Also Read : MLC Elections TDP – ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం ?

Show comments