YSR Aarogyasri:సెల్ ఫోన్లలో ‘ఆరోగ్య శ్రీ’.. యాప్ ఉండేలా ప్రభుత్వం చర్యలు!

సెల్ ఫోన్లలో ‘ఆరోగ్య శ్రీ’.. యాప్ ఉండేలా ప్రభుత్వం చర్యలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేద ప్రజలు మంచి వైద్యం అందాలనే ఆలోచనలతో  ఆరోగ్య శ్రీలో పలు మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న వాటికి కంటే మరికొన్ని వ్యాధుల చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చారు. తాజాగా ఆరోగ్య శ్రీ కార్డు దారుల సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం ఓ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. తాము చేయించుకున్న చికిత్సలు, వైద్య పరీక్షల వివరాలను లబ్ధిదారులు  వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.  అలాగే అవసరమైన నెట్ వర్క ఆస్పత్రుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కార్డుదారులకు అవసమైన వైద్యం ఏఏ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయో తెలియేజేసే వివరాలన్నీ ఆ యాప్ లో జగన్ సర్కార్ అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ ప్రోగ్రామ్ లో భాగంగా వలంటీర్లు చేపట్టిన తొలి విడత ఇంటింటి సర్వే సమయంలోనే ఈ యాప్ ను ఆరోగ్యశ్రీ కార్డుదారులు .. తమ మొబైల్స్ లో  డౌన్ లోడ్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని లబ్ధిదారుల ఫోన్లలో  డౌన్ లోడ్  చేయిస్తున్నారు. అంతేకాక ఈ యాప్ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు వివరిస్తున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు నంబర్ లేదా సంబంధిత కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్ యాప్ లో నమోదు చేస్తే.. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆరోగ్య శ్రీ వివరాలన్నీ అందులో లభిస్తాయి. అంతేకాక ఈ స్కీమ్ ద్వారా పొందిన  చికిత్స వివరాలను తెలుసుకోవచ్చు.

అంతేకాక ఎప్పుడైనా వైద్య పరీక్షల రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని  అధికారులు తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా  లబ్ధిదారులకు చికిత్స అందించినందుకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించిందన్న వివరాలను కూడా వారు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. అయితే ఈ యాప్ పై ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఏదైనా అవసరమైన సందర్భాల్లో ఆరోగ్య శ్రీ చికిత్సకు సంబంధించిన పత్రాలను ఈజీగా పొందవచ్చని సామాన్యులు అంటున్నారు. తమ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని అంటున్నారు. మరి.. సెల్ ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా ప్రజలకి వివిధ  పత్రాలు అందిస్తుడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments