Idream media
Idream media
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రవేశపెట్టిన చాలా సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాలలో కూడా ప్రారంభిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రముఖలు సైతం స్వాగతిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో జాబ్ కేలెండర్ ను అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో విషయంలో కూడా జగన్ పంథాను అవలంబిస్తున్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా జగన్ ప్రచారానికి వెళ్లలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు లేఖలు రాశారు. తాను చేసిన పనులను వారి ముందుంచి మీరే తగిన నిర్ణయం తీసుకోండని ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గ ప్రజలకు లేఖలు రాయనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చేపట్టాల్సిన అభివృద్ధి గురించి లేఖలో ప్రస్తావించనున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సాయం చేసిందు ఇందులో తెలుపనున్నారు. ఇప్పటికే రైతు బంధు గొర్రెల పంపిణీ మత్స్యకారులకు చేపల పంపిణి పథకాలు ప్రశేశపెట్టింది. ఇక కొత్తగా దళితుల అభివృద్ధికి దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం చేసే చేసిన పనులను ఈ లేఖలో ప్రస్తావించనున్నారు.
అంతేకాకుండా హుజురాబాద్ ను టికెట్ ను ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చిన కేసీఆర్ ఈనెల 26న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ప్రొసిడింగ్ పత్రాలు లబ్ధిదారులను అందజేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి రూ.500 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం కేసీఆర్ పర్యటన తరువాత అర్హులకు అందించనుంది. దీంతో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నియోజకవర్గ బాధ్యతలు అప్పటిగించిన హరీశ్ రావు ఇన్నాళ్లు తన వ్యూహంతో వ్యవహారాన్ని నడిపించారు. బుధవారం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారు. ప్రత్యక్షంగా పరిస్థితులను గమనించున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీలో చేరిన ఈటల దూకుడు పెంచారు. ఓ వైపు పాదయాత్ర చేపడుతూనే కేసీఆర్ హరీశ్ రావు లాంటి ముఖ్యనేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో హరీశ్ రావు కేసీఆర్ లు ప్రత్యక్షంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దళిత బంధు పథకం ద్వారా కేసీఆర్ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించనున్నారు. అంతేకాకుండా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 20 వేల కుటుంబాలకుపైగా సంక్షేమ పలాలు అందించనున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేయనున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు ఆసరా పింఛన్లు అందించి ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మరోసారి టీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు వస్తాయని చెబుతున్నారు. అయినా దళిత బంధు తమ ఖాతాల్లోకి వస్తేనే టీఆర్ఎస్ కు ఓటేస్తామని ఇటీవల కొందరు దళితులు అన్నారు. దీంతో కేసీఆర్ హూటాహుటిన రూ.500 కోట్లు విడుదల చేశారు. వాటిని లబ్ధిదారులకు అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. దీంతో పాటు ప్రజలకు లేఖలు రాసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.