సోము పాద‌యాత్ర చేస్తే ఫలితం ఉంటుందా ..!

ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తున్నారు. రాజ‌ధాని హైద‌రాబాద్ లో మూడు రోజులుగా కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌కు స్పంద‌న బాగానే ఉంది. అందుకు కార‌ణం పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌లి జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఇక్క‌డ బాగానే పుంజుకుంది. ఫ‌లితంగా బండి యాత్ర‌కు జ‌న స‌మీక‌ర‌ణ బాగానే చేస్తున్నారు. అంత‌కు ముందు జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఆ పార్టీ విజ‌యం సాధించింది. ఈ క్రమం లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నా రు. ఒకవైపు ప్రభుత్వంపై రాజీలేని పోరు చేస్తున్నారు. మరోవైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు.

అయితే, తెలంగాణ‌లో బండి సంజ‌య్ పాదయాత్ర చేయ‌డం బాగానే ఉంది. అయితే, ఇ ప్పుడు ఇదే ఐడియాను.. ఏపీలోనూ అమలు చేయాలని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది సాధ్యమేనా? అస‌లు ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీకి వ్య‌తిరేకంగా ఏ పార్టీ అయినా ఉద్య‌మం చేప‌డితే ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ఉంటుందా? ఇర‌వై మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీకే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తేవ‌డం త‌రం కావ‌డం లేదు. అలాంటిది ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఏపీ బీజేపీకి అంత సీనుందా అనేది ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఏపీ కంటే తెలంగాణలో పార్టీ కేడర్ బాగుంది. పైగా మాస్ నాయకుడిగా.. ఫైర్ బ్రాండ్ నేతగా.. బండి సంజయ్ గుర్తింపు పొందారు. అంతేకాదు.. ఆయన వయసులోనూ సోము కన్నా తక్కువే.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారంటే.. అర్ధం ఉందని అంటున్నా రు. కానీ ఏపీలో ఇప్పటికీ.. బీజేపీ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా అంతర్గత వివాదాలతో బీజేపీ తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు.. వ్యూహం బెడిసికొట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. సోము మాత్రం.. మరో ఆరు మాసాల్లో పాదయాత్ర చేస్తానని తన అనుచరులోచెప్పుకొస్తున్నారట. దీనికి సంబంధించి.. వ్యూహం ప్రతిపాదించే పనిలో కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే.. సోము వ్యూహం అంత ఈజీగా సఫలమయ్యే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ముందు అంతర్గత కలహాలు తగ్గించడం.. ప్రజల్లో పార్టీపై భరోసా కల్పించేలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం వంటివి చేసినప్పుడు తప్ప.. సోము ఆశిస్తున్న ఫలితం.. దక్కేలా లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Show comments