Idream media
Idream media
(అత్తారింటికి దారేది క్లైమాక్స్‌లో పవన్‌కి బదులు తాగుబోతు రమేష్ వుంటే సరదాగా సెటైర్)
రావురమేష్ – కారులో ఫ్రంట్ సీటుకి బ్యాక్ సీటుకి మధ్య దూరాన్ని ఎవరూ మార్చలేరు.
తాగుబోతు రమేష్ – ఫ్రంట్‌లో ఇంజన్ వుంటుంది. బ్యాక్‌లో డిక్కీ వుంటుంది. విలువ ఇంజన్‌కే కానీ డిక్కీకి కాదు.
రావు – అసలు ఎవర్రా నువ్వు?
తాగుబోతు రమేష్ – ఉదయం బ్యాగ్ పైపర్‌ని, మధ్యాహ్నం అరిస్ట్రొక్రెట్, సాయంత్రం నెపోలియన్, రాత్రికి బ్లాక్ డాగ్‌ని.
రావు – మరి తెల్లవారుజామున?
తాగుబోతు రమేష్ – ఓల్డ్ మాంక్‌ని
రావు – చంపేస్తారా నిన్ను
తాగుబోతు రమేష్ – అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందత్తా?… క్వార్టర్‌లో వాటర్ పోసినా , వాటర్‌లో క్వార్టర్ పోసినా కిక్కు ఒకటే. మా తాత దీపావళి తుపాకీ తీశాడు. ఈయన నిజం తుపాకీ తీశాడు. ఆయనది ఆవేశం అయితే, ఈయనది పులి వేషం. ప్రేమని దోమ కుడితే దురద, దోమని ప్రేమ కుడితే సరదా.
నదియా – మా నాన్న కాల్చింది దీపావళి తుపాకీతోనా?
రావు – ఔను సునందా… ఎలాగూ నువ్వు, మీ నాన్న పెద్దపెద్ద డైలాగ్‌లు చెప్పుకుంటారు కదా అని నాలుగు బ్రెడ్డు ముక్కలు, టమోటా సాస్ తెచ్చుకున్నా. ఈ లోగా ఆయన కాల్చాడు. సాస్ మీద పడింది. విషయం చెప్పేలోగా నువ్వు మళ్లీ డైలాగ్‌లు స్టార్ట్ చేసి లాక్కెళ్లి పోయావు. సింపతీ కోసం నేను కూడా కట్టు కట్టుకున్నా. ఏ పతికైనా సింపతీ ముఖ్యం.
అసలు మీ ఫ్యామిలీలోనే ఓవరాక్షన్ ఎక్కువ. మొన్న ఎసి పనిచేయక చెమట్లు పడితే , గుండెపోటు అనుకుని వీడు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చాడు. హార్ట్ తప్ప అన్ని పార్ట్‌లు టెస్ట్ చేసి లక్ష రూపాయలు బిల్లు వేశారు.
తాగుబోతు రమేష్ – మెడిసిన్‌ని మందు అంటారు కానీ, మందుని మెడిసిన్ అనరత్తా. ఒక్క క్షణం ఆగి వుంటే ఆ ఇంట్లో నీకు ఇంకో కేక వినిపించేది. తాత ఆవేశంలో టపటపమని కాలిస్తే ఆ రవ్వలు మా అమ్మ కంట్లో పడి రేచీకటి వచ్చింది. దాంతో ఆమె గాజు గ్లాసులన్నీ పగలకొడుతూ వుంటే మా నాన్న స్టీల్ గ్లాస్‌లోనే మందు తాగుతున్నాడు. గాజు ముక్కలు గుచ్చు కోకుండా అప్పటి నుంచి చక్రాల కుర్చీపైన్నే తాత తిరుగుతున్నాడు. బీరుకి నీరుకి తేడా తెలియకుండా పెరిగాను. కిక్కు ఎక్కి కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేసేవాన్ని. మమ్మల్ని క్షమించు, శిక్షించు. కానీ రక్షించు. ముసలోడు ప్లాష్ బ్యాక్‌లు చెప్పిచెప్పి భక్షిస్తున్నాడు.
ఎమ్మెస్ నారాయణ – ఎంత తాగాలో కాదు … ఎంత వాగాలో తెలిసిన వాడే గొప్పవాడు…. పంచ్ డైలాగ్‌లు చెప్పడానికి పంచె కట్టుకోనక్కర్లేదు. ప్యాంట్ వేసుకుని కూడా చెప్పొచ్చని నిరూపించారు … మీరు గ్రేట్ సార్.
తాగుబోతు రమేష్ – కొందరు పొడిచి చంపుతారు … నీలాంటి వాళ్లు పొగిడి చంపుతారు … సింహం నిద్రపోతుంది కదా అని జూలుతో జడవేసినా తప్పులేదు. కానీ పూల జడ వేయకూడదురోయ్. పులి పలకరించింది కదా అని ఫొటో దిగినా తప్పు లేదు కానీ వాట్సప్‌లో పెట్టకూడదు. సింహం నేనూ ఒకటే. అది గడ్డం తీసుకోలేదు, నేనూ గీసుకోలేను. ఎందుకంటే చేతులు వణికి పీక కోసుకుంటానని భయం. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు.
ఎమ్మెస్ – ఇప్పటికే రెండు ఫుల్ తాగారు. ఇంకా తాగితే క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ అవుతుంది.
తాగుబోతు రమేష్ – సీన్‌లోకి వచ్చిన ప్రతివాడూ పంచ్ డైలాగ్‌లు చెప్పడానికి ఇదేం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కాదు. లైఫ్. కైపుకెక్కువ… నైఫ్‌కి తక్కువ.
Also Read: క్యారెక్టర్ లేని రాజరాజచోరుడు