Idream media
Idream media
రాజకీయాలు అంటేనే సామాజిక సమీకరణాలపై ఆధారపడి ఉంటాయి. కేవలం ఎన్నిక ల సమయంలోనే కాకుండా.. అన్ని దశల్లోనూ కొన్ని కీలక కులాలు.. పార్టీలను నడిపిస్తున్నాయి. ఈ క్రమం లోనే ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం పాత్ర కీలకంగా ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు… అదే సమయంలో 2014 ఎన్నికల కు ముందు కూడా కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. ఈ క్రమంలో నే వారి డిమాండ్లు నెరవేరుస్తామంటూ.. పార్టీల అధినేతలు కూడా ప్రకటించారు. దీంతో కాపులకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఎప్పటి నుంచో ఈ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉన్నప్ప టికీ.. చిరంజీవి, ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు మరింత పెరిగింది. కాపులను 2014లో తనవైపు తిప్పుకోవడంలోను వారి ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సఫలమయ్యారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చారు. కాపు కొర్పొరేషన్ ఏర్పాటు చేశారు. నిధులు కేటాయించారు కానీ, ఇచ్చిన హామీల మేరకు ఏదీ పూర్తిగా నెరవేర్చలేదు. దీంతో 2019లో బాబు… కాపుల విశ్వాసం పొందలేక పోయారు.
అదే ఎన్నికలకు ముందే.. వైసీపీ అధినేత జగన్ కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అందుకు గల కారణాలను, వాస్తవాలను వారి ముందుంచారు. కార్పొరేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో జగన్ కే కాపు సామాజిక వర్గం కూడా పట్టం కట్టింది. ఇది ప్రతిపక్ష టీడీపీని సహా ఇతర పార్టీలను కూడా నివ్వెర పోయేలా చేసింది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి కాపు కార్పొరేషన్ కు నిధులను పెంచారు జగన్. దీంతో జగన్ ఆ సామాజిక వర్గానికి మరింత చేరువయ్యారు.
అంతటితో ఆగకుండా.. మంత్రి పదవులు కేటాయించడంతోపాటు.. తాజాగా ప్రకటించిన నేతన్న నేస్తం పథకంలో ఏకంగా 2384 మంది కాపులకు ప్రయోజనం చేకూర్చారు. దీనికి తోడు తాజాగా ఈబీసీ రిజర్వేషన్ల ను సైతం ఏపీలో అమలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. వారిలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు.. కాపులకు దూరమైనట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.