ఆ రెండు కార్యాలయాలు కర్నూలుకు.. న్యాయరాజధానిలో మరో ముందడుగు

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వైసీపీ సర్కార్‌ ప్రతిపాదించిన మూడు రాజధానుల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ.. ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా, రాయలసీమలో కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటు చేసేందుకు వైసీపీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ, కర్నూలు నగరాల్లో అవసరమైన చర్యలు చేపడుతోంది. తాజాగా న్యాయరాజధాని ఏర్పాటులో భాగంగా జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న ఏపీ లోకాయుక్త, ఉప లోకాయుక్తలను కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కర్నూలు కేంద్రంగా లోకాయుక్త, ఉప లోకాయుక్తలు పని చేయబోతున్నాయి. ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు న్యాయశాఖకు చెందిన మూడు విభాగాలను కర్నూలులో ఏర్పాటు చేసినట్లైంది.

ఇప్పటికీ అదే దారిలో టీడీపీ..

మూడు రాజధానుల ఏర్పాటును ఇప్పటికీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తోంది. మూడు రాజధానులకు ప్రజల మద్ధతు లేదని ఇప్పటికీ చెబుతూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టంకట్టడంతోనే మూడు రాజధానులకు ప్రజల మద్ధతు ఉన్నట్లు రుజువైంది. అయినా ప్రజా అభిప్రాయాన్ని పట్టించుకోని టీడీపీ తనదారి తానదేననేలా వ్యవహరిస్తోంది. మరో వైపు విశాఖపై కుట్రలు చేస్తూనే ఉంది. సముద్ర మట్టం పెరిగి భవిష్యత్‌లో విశాఖ కనుమరుగవతుందని అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలు రాయిస్తోంది.

పట్టువిడవని వైసీపీ..

మూడు రాజధానుల ఏర్పాటు వల్ల మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని, ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఉన్న వైసీపీ సర్కార్‌.. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది. సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై తన వాదనను సమర్థవంతంగా వినిపిస్తోంది. ఆయా పిటిషన్లకు సంబంధించిన విచారణ జరగాల్సి ఉంది. కోవిడ్‌ నేపథ్యంలో విచారణను నవంబర్‌ 15వ తేదీకి ఇటీవల హైకోర్టు వాయిదా వేసింది. కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాత మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతగా సాగుతుంది.

Also Read : అధిక ఫీజుల నియంత్రణకు మరో అడుగు.. ఫోన్‌ చేస్తే సమస్య పరిష్కారం

Show comments