Ambati Ramababu: బాబు అరెస్ట్ తో హరికృష్ణ ఆత్మ శాంతిస్తోంది: మంత్రి అంబటి రాంబాబు

బాబు అరెస్ట్ తో హరికృష్ణ ఆత్మ శాంతిస్తోంది: మంత్రి అంబటి రాంబాబు

మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఇతర అంశాలపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిదే. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత.. ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలే  చంద్రబాబు, నారా లోకేశ్ ల పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గతంలో చేసిన ఎన్నో పాపాలు, మోసాలు, అన్యాయాలు పండి..నేడు చంద్రబాబు ఫలితం అనుభవిస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు,లోకేశ్ లపై ఫైరయ్యారు.  చంద్రబాబు అరెస్ట్ తో నందమూరి హరికృష్ణ ఆత్మ కూడా శాంతిస్తోందన్నారు.

గురువారం తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై నాటకం ఆడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో కలత చెంది ఎవరూ చనిపోలేదని మంత్రి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు జైలులో పటిష్ట భద్రత ఉందని, ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే పేరుతో యాత్ర చేయబోతున్నారట. నిజంగానే నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.

చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నిజాలను పాతాళంలోకి తొక్కేశారని, వ్యవస్థలను మ్యానేజ్ చేసేవారని. ఇప్పుడు నిజం గెలుస్తంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారంటూ మంత్రి పేర్కొన్నారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారు? ఆయన ప్రశ్నించారు.నిజాన్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఓడిపోతూనే ఉందని జోష్యం చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక ఎన్టీఆర్, హరికృష్ణ, వంగవీటి రంగా, కందుకూరు, గుంటూరు సభలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు జైల్లో నుండి కూడా కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే బాలకృష్ణను తప్పించి.. భువనేశ్వరిని తీసుకొచ్చారని మంత్రి తెలిపారు.

నారావారి చేతిలో నుండి పార్టీ నందమూరి వారి చేతిలోకి వెళ్తుందనే భయం కాదా? అని ప్రశ్నించారు.  నారా లోకేశ్ పై కూడా మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. టీడీపీకి పట్టిన శని నారా లోకేష్ అని,  ఆయన వచ్చాకే టీడీపీ భ్రష్టు పట్టిందని మంత్రి అన్నారు. టీడీపీ వారు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరని, అన్ని ఆధారాలతో కేసు బలంగా ఉందని, చంద్రబాబు కేసు నుండి తప్పించుకోలేరని మంత్రి తెలిపారు. మరి.. చంద్రబాబు, నారా లోకేశ్ లపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments