iDreamPost
android-app
ios-app

ఆరు నెలల్లో ఇన్ని పాన్ ఇండియా సినిమాలా !

  • Published Jul 17, 2025 | 2:47 PM Updated Updated Jul 17, 2025 | 2:47 PM

2025 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. పైగా బాగా ఆడుతాయి అనుకున్న సినిమాలు ప్లాప్ అవ్వడం..అందరికి షాక్ ఇచ్చింది. అలాగే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. డీసెంట్ హిట్ అందుకున్న సినిమాలు ఇంకొన్ని.

2025 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. పైగా బాగా ఆడుతాయి అనుకున్న సినిమాలు ప్లాప్ అవ్వడం..అందరికి షాక్ ఇచ్చింది. అలాగే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. డీసెంట్ హిట్ అందుకున్న సినిమాలు ఇంకొన్ని.

  • Published Jul 17, 2025 | 2:47 PMUpdated Jul 17, 2025 | 2:47 PM
ఆరు నెలల్లో ఇన్ని పాన్ ఇండియా సినిమాలా !

2025 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. పైగా బాగా ఆడుతాయి అనుకున్న సినిమాలు ప్లాప్ అవ్వడం..అందరికి షాక్ ఇచ్చింది. అలాగే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. డీసెంట్ హిట్ అందుకున్న సినిమాలు ఇంకొన్ని. అయితే ఈ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆరు నెలల్లో ఒక్క నవంబర్ తప్ప .. మొత్తం 10 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి అనే విషయాలు చూసేద్దాం.

జూలై లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ ఉంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ టాక్ మొదలైపోయింది. జూలై 24న విడుదల కానుంది. ఇక ఆ తర్వాత ఆగస్టు లో రెండు పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ రెడీ అవుతున్నాయి. ఆగష్టు 14 న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 , రజినీకాంత్ కూలి సినిమాలు తలపడనున్నాయి. ఈ రెండు సినిమాలకు హోరాహోరీగా హైప్ నడుస్తుంది. ఇక సెప్టెంబర్ లో మరో పవన్ సినిమా ఓజి అభిమానులను ఊరిస్తుంది. అదే రోజున బాలయ్య అఖండ మూవీ కూడా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక యంగ్ హీరో తేజ సజ్జ తన మిరాయ్ సినిమాను సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు అయితే దాని నుంచి ఎలాంటి సౌండ్ లేదు. సో ఏమౌతుందో చూడాలి. ఇక అక్టోబర్ లో రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నవంబర్ లో ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేదు. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. ఆ మంత్ లో కూడా డేట్స్ ఫిల్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక డిసెంబర్ 5న అసలు సిసలైన పాన్ ఇండియా కింగ్ .. రాజాసాబ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత క్రిస్మస్ స్పెషల్ గా యంగ్ హీరో అడవి శేష్ డెకాయిట్ రానున్నాడు. ఇక 2025 సెకండ్ ఆఫ్ లో ఈ పాన్ ఇండియా సినిమాలు ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.