Budget 2024 Analysis: బడ్జెట్​ ప్రసంగానికి​ స్పెషల్ శారీలో నిర్మలా సీతారామన్.. ఆ చీర ప్రత్యేకత ఏంటంటే..!

Union Budget 2024 Highlights & Analysis in Telugu: ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ ప్రసంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ శారీలో వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ధరించిన చీర ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Union Budget 2024 Highlights & Analysis in Telugu: ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ ప్రసంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ శారీలో వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ధరించిన చీర ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్​ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. 2024 పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవాళ ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ విశిష్టతను సంతరించుకుంది. బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలసి బడ్జెట్ సమర్పించేందుకు పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె లోక్​సభ్​కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి డ్రెస్సింగ్ నుంచి చేతిలో ఉండే బడ్జెట్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటీ స్పెషల్​గా నిలిచాయి. ప్రతి ఏడాది బడ్జెట్​ ప్రసంగం నాడు ప్రత్యేకమైన చీర కట్టుకొని రావడం నిర్మలమ్మకు అలవాటు. ఈసారి కూడా నీలం, క్రీమ్ కలర్ టస్సర్ చీరలో కనిపించారు తెలుగింటి కోడలు. దీంతో ఈ చీర స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు.

టస్సర్ పట్టు చేనేత చీర కట్టుకొని పార్లమెంటులోకి అడుగుపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. చేతిలో బడ్జెట్ ట్యాబ్ పట్టుకొని గోధుమ రంగులో బెంగాల్ కల్చర్​ను ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో ఉన్న శారీలో మెరిసిపోయారు. ఆమె ధరించిన చీరకు ఉన్న నీలి రంగును తమిళనాడులో ‘రామా బ్లూ’ అని పిలుస్తారు. ఇటీవల అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్​లల్లా ప్రాణప్రతిష్టకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరలో కనిపించారు. అటు బెంగాల్​తో పాటు ఇటు తమిళనాడు సంప్రదాయాన్ని కలగలిపిన చీరను ధరించిన నిర్మలమ్మ.. అయోధ్య మందిర ప్రాణప్రతిష్టను కూడా గుర్తుచేయడంతో రామ భక్తుల మనసులు కూడా దోచుకున్నారు. ఈ ఏడాదే కాదు గత కొన్నేళ్లుగా బడ్జెట్ ప్రసంగం రోజు స్పెషల్ శారీస్ ధరించడం నిర్మలమ్మకు అలవాటుగా మారింది.

2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది బడ్జెట్​ ప్రసంగానికి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చీరలో దర్శనమిస్తున్నారు. అయితే ఎప్పుడూ చేనేత చీరే ధరిస్తుండటం విశేషం. వాటి మీద తనకు ఉన్న ఇష్టాన్ని ఒక సందర్భంలో ఆమె ప్రస్తావించారు కూడా. సిల్క్, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు తనకు ఇష్టమైన వాటిలో ఒకటని తెలిపారు. ఆ చీరల రంగు, నేత పని, డిజైన్స్ చాలా బాగుంటాయన్నారు నిర్మలమ్మ. 2023లో బ్రౌన్ కలర్​లో టెంపుల్ బోర్డర్​లో ఉన్న రెడ్ కలర్ శారీలో ఆమె కనిపించారు. అంతకుముందు ఏడాది మెరూన్ కలర్ శారీని వేసుకున్నారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే కావడం విశేషం. 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలసిన భూదాన్ పోచంపల్లి చీరలో దర్శనమిచ్చారు. 2020లో నీలం రంగు చీర, 2019లో మంగళగిరి పింక్ కలర్ శారీ కట్టుకున్నారు నిర్మలమ్మ. మరి.. ఈసారి కేంద్ర బడ్జెట్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments