P Krishna
డబ్బు సంపాదన కోసం ఈ మద్య కొంతమంది ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కవ డబ్బు సంపాదించి సంతోషంగా గడపాలని చూస్తున్నారు.
డబ్బు సంపాదన కోసం ఈ మద్య కొంతమంది ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కవ డబ్బు సంపాదించి సంతోషంగా గడపాలని చూస్తున్నారు.
P Krishna
ఈ మద్య కాలంలో చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎదుటి వారికి మాయమాటలు చెబుతూ మోసాలు చేస్తున్నారు. కొంతమంది దొంగతనాలు, బెదిరింపులు, హత్యలకు పాల్పపడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో కొంతమంది కేటుగాళ్ళు మహిళలు, యువతులను అడ్డు పెట్టుకొని అపార్ట్ మెంట్స్, స్పా సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారాలు నిర్వహిస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా విటులను బుక్ చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా తమ పని కానిస్తున్నారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేసి పట్టుకుంటున్నారు. తాజాగా హైటెక్ వ్యభిచాం గుట్టు రట్టు చేశారు బయప్పనహళ్లి పోలీసులు. వివరాల్లోకి వెళితే..
కొంతమంది కేటుగాళ్ళు హైటెక్ వ్యభిచారం దందా యేధేచ్చగా నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బ్యూటీ పార్లర్స్, స్పా సెంటర్స్, అపార్ట్ మెంట్స్ లో వ్యభిచారం గుట్టుగా నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించుకొని టెలిగ్రాం, వాట్సాప్ ద్వారా ఆన్ లైన్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించి విటులకు ఎర విసురుతున్నారు. పట్టణాలకు వలస వస్తున్న మహిళలు, యువతులను టార్గెట్ చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి, మాయ మాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. వారి ద్వారా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. మంగళవారం బయప్పనహళ్లి పోలీసులు హైటెక్ వ్యభిచారం చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న వైశాఖ్ కి నెలకు లక్షన్నర జీతం వచ్చేది. దీంతో అతడు లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటీవల స్టాక్ మార్కెట్ లో వైశాఖ్ పెట్టుబడులు పెట్టి బాగా నష్టపోయాడు.. దాంతో అప్పులు చేశాడు. అయితే టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న వైశాఖ్ జాబ్ కి గుడ్ బై చెప్పి మ్యాట్రిమోనీ టైప్ యాప్ ఒకటి డెవలప్ చేశాడు. దాని ద్వారా డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. యువతీ యువకులు ఒకరినొకరు కనెక్ట్ కావడానికి ఉపయోగపడేలా యాప్ డెవలప్ చేశాడు. ఈ యాప్ చూసి బీటెక్ పూర్తి చేసిన గోవిందరాజు.. వైశాఖ్ ని పరిచయం చేసుకొని మ్యాట్రీ మోనీ వర్క్ కాకుండా హైటెక్ వ్యభిచారం వృత్తిలోకి అడుగు పెడితే కోట్లు సంపాదించవొచ్చని బ్రెయిన్ వాష్ చేశాడు.
గోవిందరాజు అప్పటికే టర్కీకి చెందిన ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె విదేశీ యువతులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది. వైశాఖ్ డెవలప్ చేసిన యాప్ తో దేశీయ, విదేశీ యువతులతో పరిచయాలు పెంచుకొని వారికి డబ్బు ఆశ చూపించి బెంగుళూరు కి రప్పించి లీలా పార్క్ స్టార్ హూటల్ లో హైటెక్ వ్యభిచారం నిర్వహించసాగారు. సరదా కోసం డెవలప్ చేసిన యాప్ తో లక్షల్లో సంపాదించడం మొదలు పెట్టారు. బెంగుళూరుతో పాటు జైపూర్, మైసూర్, ఢిల్లీ, ఉదయ్ పూర్, ముంబై ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి వారితో స్టార్ హూటల్స్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టి పక్కా సమాచారంతో రైడ్ చేశారు పోలీసులు. ఈ రైడ్ లో నిర్వాహకులతో పాటు టర్కీకి చెందిన ముగ్గురు, ఉజ్జేకిస్తాన్, కజకిస్తాన్ కి చెందిన మొత్తం తొమ్మిది మందిని అందుపులోకి తీసుకున్నారు పోలీసులు. విదేశీ మహిళల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.