Krishna Kowshik
తెలిసిన వాళ్లే కదా అని నమ్మడం ఆమె చేసిన తప్పు. అదే ఆమెకు శాపమైంది. తన కాళ్లపై తాను బతుకుతున్న ఓ మహిళ.. కూతురు ఇంటికి బయలుదేరుతుండగా..
తెలిసిన వాళ్లే కదా అని నమ్మడం ఆమె చేసిన తప్పు. అదే ఆమెకు శాపమైంది. తన కాళ్లపై తాను బతుకుతున్న ఓ మహిళ.. కూతురు ఇంటికి బయలుదేరుతుండగా..
Krishna Kowshik
డబ్బుల కోసం ఎంతటికైనా తెగించే రోజులు వచ్చాయి. జల్సాలు, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు.. మోసాలకు పాల్పడుతున్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టి పబ్బం గడుపుకునే వాళ్లు ఓ రకమైతే.. అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడం లేదు మరో రకం. ఇందులో మహిళలు కూడా ఆరితేరిపోతున్నారు. తెలిసిన వాళ్లే కదా అని నమ్మితే.. తడి గుడ్డతో గొంతు కోస్తున్నారు కొందరు. ఇటువంటి సంఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. నమ్మటమే ఆమె చేసిన తప్పైంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని లక్ష్మిపురలో మంజుల అనే 43 ఏళ్ల మహిళ టి. దాసర హళ్లి సమీపంలోని మెట్రో పిల్లర్ కింద తమలపాకు వ్యాపారం చేసేది. ఆమెకు కొడుకు, కుమారుడు ఉన్నారు. కాగా, ఈ నెల 11న కూతురు ఇంటికి వెళ్లేందుకు బయలు దేరగా.. మార్గమధ్యంలో జీవన్ అనే వ్యక్తి కనిపించి బస్టాండ్‌లో దింపుతానని చెప్పడంతో నమ్మి..అతడి బండి ఎక్కింది. అయితే అతడు తన ఇంటికి తీసుకెళ్లాడు. జీవన్, అతడి భార్య ఆశా ఆమెకు ఏడాది నుండి తెలుసు. ఇద్దరూ తెలిసిన వారు కావడంతో ఏ మాత్రం అనుమానించకుండా వారి ఇంట్లోకి వెళ్లి కూర్చుంది మంజుల. ఇదే అదునుగా చూసిన భార్యా భర్తలు జీవన్, ఆశాలు.. ఆమె గొంతు నులిమి చంపేశారు.
అనంతరం మంజుల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని.. ఆమె మృతదేహాన్ని జీవన్, ఆశాలు గోనె సంచిలో వేసి.. వాళ్లు అద్దెకు ఉంటున్న నీటి సంపులో పడేశారు. అయితే కూతురి ఇంటికి బయలు దేరిన తల్లి ఆచూకీ తెలియకపోవడంతో కుమారుడు సందీప్.. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12న మాధనాయకన హళ్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. కాగా, జీవన్, ఆశ దంపతులు నివాసముంటున్న భవనంలో నీరు దుర్వాసన వస్తుంది. ఆ సమయంలో ఇంటి యజమాని సంపును శుభ్రం చేస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా..ఆమె కనిపించకుండా పోయిన మంజుల అని నిర్ధారించుకున్నారు. పోలీసులు జీవన్, ఆశలను సంప్రదించగా.. ఏమీ ఎరుగన్నట్లు.. తాము స్వగ్రామంలో ఉన్నామని సమాధానం ఇచ్చారు. తమ స్థలంలో దొరికిన మృతదేహం గురించి అడగ్గానే.. తమకు తెలియదంటూ బుకాయించారు. ఆ తర్వాత వారిని సంప్రదించగా.. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న జీవన్, ఆశల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.