Rachana Banerjee: బాలకృష్ణపై రచన బెనర్జీ సంచలన కామెంట్స్

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది హీరోయిన్స్ .. ఉన్నట్టుండి కనుమరుగైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి హీరోయిన్స్ లో ఒకరు రచన బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలో తన జర్నీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది హీరోయిన్స్ .. ఉన్నట్టుండి కనుమరుగైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి హీరోయిన్స్ లో ఒకరు రచన బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలో తన జర్నీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రచన బెనర్జీ తెలుగు ప్రేక్షకులు ఈ హీరోయిన్ పేరు విని చాలా కాలమే అయింది. ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె ఇప్పుడు సినిమాలలో.. అసలు కనిపించడంలేదు. ఇక ఆ తర్వాత ఈ హీరోయిన్ బెంగాలీ బుల్లితెరకు పరిమితమైందనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ ఏకంగా ఎంపీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారట. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను దూరమయ్యి చాలా కాలం అయిన కారణంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ఇండస్ట్రీ జర్నీ గురించి.. మాట్లాడుతూ .. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీనితో తెలుగు ప్రేక్షకులు ఈమెను కొనియాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రచన బెనర్జీ.. ఒక్కసారి తన టాలీవుడ్ లో తన జర్నీని గుర్తుచేసుకుంటూ.. “ఆ జ్ఞాపకాలన్నీ నేను ఎప్పటికి మర్చిపోను. ఇక్కడ నటీనటులు అందరూ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది. నేను ఇలా ఉన్నందుకు తెలుగు ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తమిళంలో సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.. నన్ను చూసి ‘నేను ప్రేమిస్తున్నాను’ చిత్రంతో లాంచ్ చేశారు. చాలామంది స్టార్లతో నటించాను. బెంగాలీ అయినా కూడా నాకు మంచి రోల్స్ ఆఫర్ చేసి ఆదరించారు. పైగా నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.” అంటూ రచన చెప్పుకొచ్చారు.

అలాగే తాను వర్క్ చేసిన హీరోల గురించి చెప్తూ.. “చిరంజీవి, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి వారు ఎంత పెద్ద స్టార్లు అయినా కూడా.. చాలా సింపుల్‌గా ఉంటారు. చిరంజీవితో పనిచేయడం చాలా బాగుంది, బాలకృష్ణ అయితే ఊరికే కోప్పడేవారు. సెట్‌లో ఏదైనా సరిగా లేకపోతే బాలయ్యకు వెంటనే కోపం వచ్చేది. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలలో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, అది మంచి ప్రాజెక్ట్ అయితేనే కమ్ బ్యాక్ ఇస్తాను. లేకపోతే అసలు చేయను. ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో తనకు రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే నాకు చాలా అభిమానం. నేను హీరోయిన్ గా ఉన్నపుడు వారు హీరోలుగా ఉండి ఉంటే బావుండేది.” అంటూ ముచ్చటించారు రచన బెనర్జీ.

అలాగే సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ.. “అన్నింటికి ఒక టైమ్ వస్తుంది. అలాగే అప్పుడు పెళ్లికి టైమ్ వచ్చిందనుకొని చేసుకున్నాను. , అందులో పెద్ద విషయం ఏమీ లేదు. పెళ్లి అయినా ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను. నేను 21, 22 వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికీ, ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హీరోయిన్ అంటే డ్యాన్స్, కొన్ని సీన్స్‌కే పరిమితం. కానీ ఇప్పుడు కథలు అనేవి మారుతున్నాయి.. పాత్రలకు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలను ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథలను కూడా ఆదరిస్తున్నారు.” అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments