Hanuman: హనుమాన్ మూవీలో బాలయ్య ట్రైన్ సీన్! పంచ్ కాదు, ప్రేమతోనే!

ప్రస్తుతం యువ హీరో తేజ సజ్జ నటించిన "హనుమాన్" మూవీ థియేటర్ లో సందడి చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం యువ హీరో తేజ సజ్జ నటించిన "హనుమాన్" మూవీ థియేటర్ లో సందడి చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

నిన్న మొన్నటి వరకు సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్న చిత్రాల గురించి ఎన్నో చర్చలు జరిగాయి. అయితే వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల కాగా.. అందులో యువ హీరో తేజ సజ్జ నటించిన “హనుమాన్” చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యి..ఊహించినట్టుగానే ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ ను సంపాదించుకుంటుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన సరికొత్త ప్రయత్నానికి తగినట్టుగానే ఈరోజు ఫలితాలను అందుకుంటుంది “హనుమాన్” మూవీ. ఈ చిత్రంలో కేవలం హీరో క్యారక్టర్ ను ఎలివేట్ చేయడమే కాకుండా.. హనుమంతుడిపై ఉన్న భక్తి సారాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించారు. అయితే, ఈ చిత్రంలోని ఒక సీన్ లో లెజెండరీ యాక్టర్ బాలయ్య మూవీలోని ఒక సీన్ ను రీక్రియేట్ చేశారు.

అసలు “హనుమాన్” సినిమా కథ మొత్తం.. హీరోకు హనుమంతుడి శక్తులు ఎలా వచ్చాయి, వాటిని ఉపయోగించుకుని హీరో తన ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు, అనే కోణంలో సాగుతోంది. అయితే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో హీరోకు హనుమంతుడి నుంచి కొన్ని శక్తులు లభిస్తాయి. కానీ, ఆ విషయాన్నీ ఎవరు నమ్మరు. ఈ క్రమంలో తనకు కొన్ని శక్తులు లభించాయని.. హీరో తన స్నేహితుడికి నిరూపించుకునే ఓ సన్నివేశాన్ని.. దర్శకుడు తెలుగు చిత్రాలలో టాప్ హీరోస్ చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ ను.. రీక్రియేట్ చేస్తూ అద్భుతంగా చిత్రీకరించాడు. ఈ క్రమంలో “అతడు” చిత్రంలో మహేష్ బాబు, “జల్సా” మూవీలో పవన్ కళ్యాణ్, “ఆర్య” చిత్రంలో అల్లు అర్జున్ చేసిన కొన్ని సీన్స్ ను.. హీరో తన స్నేహితుడికి చేసి చూపిస్తాడు. కానీ, అతని స్నేహితుడు నమ్మడు. ఆ తర్వాత బాలయ్య నటించిన “పలనాటి బ్రహ్మ నాయుడు ” చిత్రంలోని ట్రైన్ సీన్ ను రీక్రియేట్ చేయడంతో.. ఆ సన్నివేశం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. మాములుగానే బాలయ్య చేసిన ఒరిజినల్ ట్రైన్ సీన్ తో చాలా ఫన్నీ స్పూఫ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చిత్రంలో దర్శకుడు ఆ ఐకానిక్ సీన్ కు కాస్త కామెడీ టచ్ ఇచ్చి.. హీరోకు శక్తులు ఉన్నాయని నమ్మిచడంతో ఈ సీన్ కు మంచి హైప్ వచ్చింది. అయితే, ఇదంతా బాలయ్య మీద పంచ్ వేస్తున్నట్లుగా కాకుండా.. కేవలం ఆయన మీద ఉన్న ప్రేమతో మాత్రమే చిత్రీకరించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా, “హనుమాన్” చిత్రంలో హీరో తేజ సజ్జ.. తన క్యారక్టర్ కు వంద శాతం న్యాయం చేశాడు. విడుదలైన ప్రీమియర్ షోస్ నుంచే.. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సంక్రాంతి బరిలో బడా హీరోల సినిమాల మధ్యన ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఎంతో నమ్మకంతో “హనుమాన్” చిత్రాన్ని విడుదల చేశారు. వారికీ కథపైన ఉన్న నమ్మకమే ప్రేక్షకులను ఆకట్టుకునేల చేసిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏదేమైనా.. ఈ చిత్రంలో రీక్రియేట్ చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ కేవలం వారిపై ఉన్న అభిమానంతో మాత్రమే చేసినట్లుగా తెలుస్తోంది. మరి, హనుమాన్ చిత్రంలో రీక్రియేట్ చేసిన ఈ సన్నివేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments