Swetha
Mawaa Enthaina Song Lyrics From Guntur Kaaram: మరో రెండు రోజుల్లో "గుంటూరు కారం" చిత్రం విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "గుంటూరు కారం" చిత్రం నుంచి తాజాగా రిలీజ్ చేసిన "మావ ఎంతైనా పర్లేదు బిల్లు.. " అనే పాటకు.. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Mawaa Enthaina Song Lyrics From Guntur Kaaram: మరో రెండు రోజుల్లో "గుంటూరు కారం" చిత్రం విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "గుంటూరు కారం" చిత్రం నుంచి తాజాగా రిలీజ్ చేసిన "మావ ఎంతైనా పర్లేదు బిల్లు.. " అనే పాటకు.. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Swetha
సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ యాక్షన్ తో.. జనవరి 12న థియేటర్ లో దుమ్ము రేపబోతున్నాడు. అతి త్వరలో విడుదల అవ్వబోతున్న “గుంటూరు కారం”మూవీ మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా “గుంటూరు కారం” సినిమా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. ఆ ఈవెంట్ లో జరిగిన పలు సన్నివేశాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్, మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా చిత్ర బృందం “మావ ఎంతైనా పర్లేదు బిల్లు.. ” అనే పాటను విడుదల చేసింది. విడుదలైన కొన్ని నిమిషాలకే ఈ సాంగ్ ఆడియన్సులో మంచి రీచ్ ను సంపాదించుకుంది. ఇక, ఈ చిత్రం విడుదల అయిన తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇక తాజాగా విడుదల చేసిన సాంగ్ కు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సింగర్ శ్రీ కృష్ణ, రామాచారి ఈ సాంగ్ ను ఆలపించారు. ఒక హార్ట్ బ్రేకింగ్ సాంగ్ తో మహేష్ మాస్ స్టెప్పులతో ప్రస్తుతం ఈ సాంగ్.. తెగ వైరల్ అవుతోంది. ఈ సాంగ్ కు సంబంధించిన లిరిక్స్ ఇలా ఉన్నాయి..
పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని
సత్యేంద్ర గ్రాంఫోన్ ఇక్కడకు తెచ్చారేంది
పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని
మావా ఎంతైనా పర్లేదు బిల్లు
మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాధే డబుల్లు
మారిపోయే లోకం చెడ్డోల్లంతా ఏకం
నాజూకైన నాబోటోడికి దినదినమొక నరకం
యాడో లేదు లోపం నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాం
ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే
ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే
యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే
ఎటు తిరిగి చూడు మనకి మనమే
వన్ అండ్ ఓన్లీ లవరే
అన్నా
సర్రా సర్రా సురం
సుర్రంటాది కారం హేయ్
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
ఇనప సువ్వ కౌకు దెబ్బ
ఇరగదీసే రవన్న దెబ్బ ఉయ్..
మరి, “గుంటూరు కారం” సినిమా నుంచి విడుదలైన ఈ సాంగ్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.