నిజమైన మాంత్రికులతో దెయ్యాల సినిమా! ఇదే తొలిసారి!

సినిమాలలో అనేక రకాల జోనర్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అందరికి ఆసక్తి కలిగించేవి హర్రర్ చిత్రాలు. అయితే, తాజగా ఓ సినిమా నిజమైన మాంత్రికులు, తాంత్రికులు ,మంత్ర శక్తులను ఉపయోగించి తీసారట. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

సినిమాలలో అనేక రకాల జోనర్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అందరికి ఆసక్తి కలిగించేవి హర్రర్ చిత్రాలు. అయితే, తాజగా ఓ సినిమా నిజమైన మాంత్రికులు, తాంత్రికులు ,మంత్ర శక్తులను ఉపయోగించి తీసారట. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రేక్షకులకు సినిమాల మీద ఉండే అభిమానం అంత ఇంత కాదు. భాషతో జోనర్ తో సంబంధం లేకుండా.. వచ్చిన ప్రతి సినిమాను ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా హర్రర్ చిత్రాలను ఇష్టపడే వారి సంఖ్య పెరిగిపోయింది. వారు ఎంత భయస్తులైనా సరే.. హర్రర్ సినిమాలను చూడడం మాత్రం మానరు. ఇక దర్శకులు కూడా ఈ పాయింట్ ను బేస్ చేసుకుని .. హర్రర్ ఫిల్మ్స్ ని ఇంకాస్త విభిన్నంగా చిత్రీకరిస్తున్నారు. కానీ, వాటిలో కొన్ని కల్పిత కథలు , కొన్ని యదార్ధ కథలు ఉంటాయి. అలానే , ఆయా సినిమాలలో నటించే మాంత్రికులు, యాంత్రికులు కేవలం నటి నటులు మాత్రమే. అయితే, వీటిన్నంటి మధ్యన తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ సినిమాని మాత్రం.. యదార్ధ సంఘటనలతో.. నిజమైన మాత్రికులతో చిత్రీకరించారట. దీనితో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఇప్పటి వరకు మనం ఎన్నో హర్రర్ ఫిల్మ్స్ చూసి ఉంటాం. విరూపాక్ష , పొలిమేర తరహా సినిమాలన్నీ కూడా ఇలాంటి హర్రర్ ఫిల్మ్ జోనర్ లోకే వస్తాయి. క్షణ క్షణ ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు, ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించే కథలు.. ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటాయి. కాబట్టి, ప్రస్తుతం ఓ రకంగా వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది. దర్శకులు కూడా కొత్త కొత్త కథలతో.. వినూత్న అంశాలతో ఈ తరహా జోనర్స్ ను నడిపించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రజీత్ రవీంద్రన్ .. నిజమైన దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలపై పరిశోధన చేసి .. నిజమైన మాంత్రికులతో.. “డెవిల్ హంటర్స్” అనే సినిమాను.. రూపొందించారు. ఇప్పటివరకు ఎటువంటి హర్రర్ చిత్రాలలో చూపించని ఎన్నో నిజమైన సన్నివేశాలను .. ఈ చిత్రంలో చూపించారట.

పైగా.. మరణించిన వారి మూఢ నమ్మకాలపై చర్చించే కథా సారాంశంతో ఈ సినిమాను తీసినట్లు సమాచారం. అంతేకాకుండా.. స్వయంగా ఈ మూవీ డైరెక్టర్ ప్రజీత్ రవీంద్రన్ కు .. గత 25 ఏళ్లుగా ఈ తంత్ర శాస్త్రాలపై అవగాహనా ఉన్న కారణంగా.. కొన్ని యదార్ధ సంఘటనలు కూడా ఈ సినిమాలో పొందుపరిచినట్లు తెలియయజేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన వారంతా .. నిజమైన మాత్రికం చేయగలిగిన వారట. ఈ విషయమే ఇప్పుడు అందరికి “డెవిల్ హంటర్స్” చిత్రంపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments