హృదయ విదారకం.. ఒకే ఇంట్లో 11 మృతదేహాల కలకలం!

ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలు వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకం రేపుతుంది.. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. హృదయ విదారకమైన దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలు వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకం రేపుతుంది.. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. హృదయ విదారకమైన దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

సమాజంలో జరిగే కొన్ని షాకింగ్ ఘటనలు చూస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు ఇతర కారణాల వల్ల చనిపోయేవారు కొంతమంది.. జీవితంపై విరక్తి చెంది మరణించేవారు కొంతమంది.. బంగారం, డబ్బు, ఆస్తి కోసం జరిగే హత్యలు మరికొన్ని.. ఇలా ఎన్నో సంఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. హృదయ విదారకమైన ఓ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఇందులో ఆడవాళ్లు, చిన్న పిల్లలు ఉండటం తీవ్ర కలకం రేపుతుంది.. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు తీవ్ర కలకం రేపింది. మృతదేహాలు రెండు రోజులుగా అక్కడే పడి ఉన్నాయి. చుట్టు పక్కల వాళ్లకు అనుమానం రావడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.. వీరంతా అన్నదమ్ముల కుటుంబాల సభ్యులుగా తెలుస్తుంది. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తు‌న్ ఖ్యవానా ప్రావిన్స్ లోని లక్కీ మార్వాత్‌ది లో ఈ విషాద ఘటన జరిగింది. పదకొండు మంది విషపూరిత ఆహారం తీనడం వల్లే చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు విచారణ ప్రారంభించారు.. ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా ఇంటి పంపకం విషయాలో ముగ్గురు అన్నదమ్ములకు గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆ కుటుంబానికి చెందిన వజీరిస్తాన్ ఆహారం తీసుకువచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైలో విచారించ అసలు నిజం బయటపెట్టారని పోలీసులు తెలిపారు. ఇంట్లో గొడవల కారణంగానే ఆహారంలో విషం పెట్టినట్లు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరణించిన కుటుంబ సభ్యులలో ఇద్దరు సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 11 మంది మృతదేహాలు నిర్జీవంగా పడి ఉండటం చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments