మగువలకు షాక్..ఊరించి ఉసూరుమనిపించి..! నేడు పసిడి ధర ఎంతంటే!

Gold and Silver Rates: ప్రపంచంలో గోల్డ్ కి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే దీనికి విపరమీతమైన డిమాండ్ ఉంటుంది. కొంత కాలంగా దేశంలో పసిడి ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.

Gold and Silver Rates: ప్రపంచంలో గోల్డ్ కి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే దీనికి విపరమీతమైన డిమాండ్ ఉంటుంది. కొంత కాలంగా దేశంలో పసిడి ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.

బంగారం అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు అంటే ఎంతో మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి. ఇటీవల పసిడి ధరలు ఒకటీ రెండు రోజులు మినహాయిస్తే వరుసగా పెరిగిపోతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండి పై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో తరుచూ ధరల్లో మార్పులు, చేర్పులు సంభవిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి వరుసగా పతనమైన పసిడి ధరల మళ్లీ షాక్ ఇస్తున్నాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇటీవల బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొనుగోలుదారు. జనవరి, ఫిబ్రవరిలో భారీగా పతనమైన పసిడి ధర మార్చి, ఏప్రిల్ లో పుంజుకుంది. ప్రస్తుతం మార్కెట్ లో పసిడి ధర 75 వేల మార్క్ దాటిపోయింది. దీంతో కొనుగోలుదారులు పసిడి కొనుగోలు విషయంలో ఆలోచనలో పడిపోతున్నారు. ఏప్రిల్ నెలలో వరుసగా పెరిగిపోతూ వచ్చిన పసిడి గత మూడు రోజుల నుంచి ఊరటనిస్తూ వచ్చింది. ఇది రెండు రోజుల మురిపమే అన్నట్లు మరోసారి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.72,660 గా నమోదు అయ్యింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.66,610 వద్ద కొనసాగుతుంది. ఇదే ధరలు వరంగల్, విశాఖపట్నం, విజయవాలో కొనసాగుతుంది. కిలో వెండి ధరపై రూ.100 తగ్గి రూ.86,400 కి చేరింది.

ప్రధాన నగరాలు అయిన ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,810 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,610 వద్ద కొనసాగుతుంది. ముంబై, కకోల్‌కతా, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,650 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,420 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,300 వద్ద కొనసాగుతుంది.ఢిలీ, ముంబై, కోల్ కొతా లో కిలో వెండి ధర రూ.82,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.56,400, బెంగుళరు లో కిలో వెండి ధర రూ.82,500 వద్ద కొనసాగుతుంది.

Show comments