Swetha
పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ చేస్తూ.. తాము కూడా స్వయంగా సంస్థలను నిర్మించి.. ఫౌండర్స్ కావాలని.. ఎంతో మంది వారి వారి జాబ్స్ ను వదిలేసుకొని.. స్థాపించిని కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వదులుకుని వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ చేస్తూ.. తాము కూడా స్వయంగా సంస్థలను నిర్మించి.. ఫౌండర్స్ కావాలని.. ఎంతో మంది వారి వారి జాబ్స్ ను వదిలేసుకొని.. స్థాపించిని కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వదులుకుని వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Swetha
ప్రపంచం అంతా డబ్బు వెనుకే పరిగెడుతోంది. బిచ్చగాడి నుంచి బిలినియర్ వరకు అందరికి డబ్బు లేకుండా ఒక పూట కూడా గడవదు. అందరూ డబ్బు వెనుక పరుగులు తీసే క్రమంలో.. ఒక్క జాబ్ వచ్చినా చాలు సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. దీనికోసం ఎంతో మంది ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇండియాలో కూడా ఎంట్రప్రెన్యూర్షిప్ అనేది గత పదేళ్ల నుంచి బాగా ఊపందుకుంది. వీటిలో ఎంతో మంది ఫౌండర్స్ కావాలని.. ఇతరులకు ఎంప్లాయిమెంట్ అందించాలనే ధ్యేయంతో ఆరెంకల స్టాండర్డ్ జాబ్స్ ను వదిలేసుకొని.. ఆయా బిజినెస్ లను రూ. 1000 కోట్ల టర్నోవర్‌కు చేర్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ కూడా ఇటువంటిదే.
జీవితం ఏమి సినిమా కాదు అనుకున్న వెంటనే అన్ని అయిపోడానికి. మంచి ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం చేయాలని అనుకున్న వెంటనే.. నిమిషాల్లో సక్సెస్ రావడం అనేది సినిమాలలో చూస్తుంటాం. కానీ, నిజానికి నిజ జీవితంలో ఒక స్టాండర్డ్ జాబ్ వదులుకుని వ్యాపారం మొదలుపెట్టి .. వారి కలలు సాకారం చేసుకోవడం అనేది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. కానీ, బెంగుళూరుకి చెందిన కృష్ణన్ మహదేవన్ అనే వ్యక్తి సాధ్యం చేసి చూపించాడు. కృష్ణన్ మహదేవన్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్ సాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పని చేసేవారట. అయితే, వీరి కుటుంబం మాత్రం ఇడ్లిలా వ్యాపారం చేస్తూ ఉండేవారు. రెస్టారెంట్ వెంచర్‌ను కృష్ణన్ తండ్రి 2001లో స్థాపించారు. బెంగుళూరులోని విహ్యాన్ నగర్‌లో వీరి ఇడ్లీ వ్యాపారం చాలా ఫేమస్. గత 20 ఏళ్లలో అయ్యర్ ఇడ్లీకు సంబంధించిన రుచిపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. బెంగుళూరు నలుమూలల నుండి వీరి వద్దకు.. చాలా మంది వస్తుంటారు.
అయితే, 2009లో కృష్ణన్ తండ్రి చనిపోవడంతో.. వారి కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించడం కోసం కృష్ణన్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం కృష్ణన్, అతని తల్లి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీరి రెస్టారెంట్ లో ప్రతి నెల 50,000 కంటే ఎక్కువ ఇడ్లీలు అమ్ముడవుతాయి. ఇక ఈ మధ్య వారు ఇడ్లిలతో పాటు వడ, కేసరి భాత్, ఖారా బాత్ వంటకాలను కూడా మెనూలో యాడ్ చేశారు. అయితే, కృష్ణన్ కు ఉద్యోగం రాకముందు కూడా ఈ వ్యాపారంలో వారి తల్లి తండ్రులకు సహాయం చేసేవాడట. ఇప్పుడు తన తల్లికి సహాయంగా ఉండడం కోసం పూర్తి దృష్టిని వ్యాపారం మీద పెట్టి, తన కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం కృష్ణన్ ఈ వ్యాపార రంగంలో అధ్బుతంగా రాణిస్తున్నాడు. కుటుంబం కష్టాల్లో ఉంటే అండగా ఉండడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి.. ఏ మాత్రం సంకోచించకూడదని. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు కృష్ణన్ మాధవన్.