HDFC నుంచి 4 కొత్త క్రెడిట్ కార్డులు.. ఇవి మీకు ఉపయోగపడతాయేమో చూడండి!

ప్రస్తుతం సమాజంలో ఆన్లైన్ అప్లికేషన్స్ తో పాటు.. క్రెడిట్ కార్డు యూజర్లు కూడా ఎక్కువైపోయారు. అటువంటి వారికీ తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ గుడ్ న్యూస్ చెప్తూ.. నాలుగు కొత్త క్రెడిట్ కార్డులను, వాటి అప్ డేటెడ్ ఫీచర్లను తెలియజేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం సమాజంలో ఆన్లైన్ అప్లికేషన్స్ తో పాటు.. క్రెడిట్ కార్డు యూజర్లు కూడా ఎక్కువైపోయారు. అటువంటి వారికీ తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ గుడ్ న్యూస్ చెప్తూ.. నాలుగు కొత్త క్రెడిట్ కార్డులను, వాటి అప్ డేటెడ్ ఫీచర్లను తెలియజేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

సాధారణంగా ఇప్పుడు ఎక్కువ మంది ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తూ ఉన్నారు. ఎంతో మందికి ఈ క్రెడిట్ కార్డుల వలన చాలా బెనిఫిట్స్ కలుగుతున్నాయి. దీనితో బ్యాంకులు కూడా కొత్త కొత్త ఫీచర్లతో .. క్రెడిట్ కార్డులను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. నాలుగు కొత్త క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. ఈ క్రెడిట్ కార్డులు చిన్న చిన్న వ్యాపారస్థులతో పాటు మధ్యస్థాయి వాయపాస్తులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా లాంచ్ చేసిన ఈ నాలుగు క్రెడిట్ కార్డుల పేర్లు ఇలా ఉన్నాయి .. బిజ్ ఫస్ట్, బిజ్ గ్రో, బిజ్ పవర్, బిజ్ బ్లాక్ . వీటిని ఫిబ్రవరి 6వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ఈ క్రెడిట్ కార్డుల పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

అయితే ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్లను దృష్టిలో ఉంచుకుని .. లాంచ్ చేసిన ఈ క్రెడిట్ కార్డుల రేంజ్ .. 55 రోజుల పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ సైకిల్ కల్పిస్తోంది. అలాగే, వెండర్ పేమెంట్స్, బిజినెస్ ప్రొడక్టివిటీ, జీఎస్‌టీ, ఇన్‌కమ్ ట్యాక్స్, యుటిలిటీ బిల్స్, బిజినెస్ ట్రావెల్ టూల్స్ లాంటి ముఖ్యమైన చెల్లింపులను.. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆదా చేసుకోవచ్చని బ్యాంక్ వారు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ నాలుగు క్రెడిట్ కార్డుల ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికీ .. మొదట 55 రోజులు ఫ్రీ క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. అలాగే బిజినెస్ చెల్లింపులపై 10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ప్రత్యేకంగా బిజినెస్ కోసం రూపొందించిన కార్డులు. అంతేకాకుండా ఈ కార్డులపై ఈఎంఐ లోన్ సౌకర్యాలు ఉంటాయి. మారి ముఖ్యంగా ఫ్రీలాన్సర్ల కోసం ప్రత్యేకంగా గిగా బిజినెస్ క్రెడిట్ కార్డులను ఇవ్వనుంది.

ఇక వీటితో పాటు అదనంగా మరో రెండు క్రెడిట్ కార్డులను రూపొందించనుంది. బిజ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డు, బిజ్ పవర్ క్రెడిట్ కార్డు. వీటిలో బిజ్ బ్లాక్ మెటల్ కార్డును తీసుకోవాలంటే కనీసం 21 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపు ఉన్నవారు అయ్యి ఉండాలి. అంతే కాకుండా దీనిని తీసుకోవాలంటే వార్షిక ఐటీఆర్ కనీసం రూ.21 లక్షలపైన ఉండాలి.. అలాగే వారి ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, మెర్చంట్ పేమెంట్ రిపోర్ట్స్ ద్వారా ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక బిజ్ పవర్ క్రెడిట్ కార్డు విషయానికొస్తే 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ కార్డు తీసుకోవచ్చు. ఈ కార్డు తీసుకునేందుకు వారి వార్షిక ఐటీఆర్ కనీసం రూ.12 లక్షలకుపైగా ఉండాలి. దీనిలో కూడా 55 రోజుల పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. మరి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్తగా లాంచ్ చేయబోతున్న ఈ క్రెడిట్ కార్డ్స్ విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments