Pallavi Prasanth: రాజకీయాల్లోకి పల్లవి ప్రశాంత్!.. అందరి ఆశీస్సులు ఉంటే పార్లమెంట్ కు!

Pallavi Prasanth: రాజకీయాల్లోకి పల్లవి ప్రశాంత్!.. అందరి ఆశీస్సులు ఉంటే పార్లమెంట్ కు!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ .. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అయితే , తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయినా పల్లవి ప్రశాంత్ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ .. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అయితే , తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయినా పల్లవి ప్రశాంత్ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నిటిలో సీజన్ 7కి వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. ఈ సీజన్ మొత్తం ఒక ఎత్తైతే.. టైటిల్ విన్నర్ ని అనౌన్స్ చేసిన తర్వాత .. ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలు మరొక ఎత్తు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో .. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. ఎన్నో రోజులు బిగ్ బాస్ గేటు ముందు పడిగాపులు కాసిన ఓ సామాన్య రైతుబిడ్డ.. ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. కస్టపడి గేమ్స్ ఆడి.. ఆడియన్సు ను ఎంటర్టైన్ చేసి.. ఫైనల్ గా ఆ సీజన్ విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఆ షో అయిపోయిన తర్వాత జరిగిన గొడవలలో .. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇక ఇప్పుడు తాజాగా పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన . ఓ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. రాజకీయాల గురించి కూడా.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయినా పల్లవి ప్రశాంత్ .. అక్కడ మాట్లాడుతూ .. “మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఎదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు, మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను. అందుకే మీ ముందు ఇలా నిలబడ్డాను. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అసలు భయపడను, వెనక్కు వెళ్ళను.. ఇలాగె నిలబడతాను. రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు.” అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.

ఈలోపు శివాజీ పార్లమెంట్ కు కూడా వెళ్తాడు అని చెప్పగా.. దానికి పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ.. “మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది.” అంటూ వ్యాఖ్యానించాడు. దీనితో పల్లవి ప్రశాంత్ మాటలను బట్టి చూస్తే.. ఒకవేళ ప్రజలు కనుక అతనికి సపోర్ట్ చేస్తే.. రాజకీయాల్లోకి కూడా పల్లవి ప్రశాంత్ అడుగు పెట్టి.. తన సత్తా చూపించే అవకావం లేకపోలేదు. ఇక ఈ మాటలను చూసిన నెటిజన్లకు.. పల్లవి ప్రశాంత్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడా ! అనే సందేహాలు మొదలయ్యాయి. మరి, పల్లవి ప్రశాంత్ తాజాగా పాలిటిక్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments