మొబైల్ యూజర్లకు షాక్.. ఇక ఫోన్ నంబర్‌కూ ఛార్జీలు వసూలు చేయనున్న ట్రాయ్?

మొబైల్ యూజర్లకు షాక్.. ఇక ఫోన్ నంబర్‌కూ ఛార్జీలు వసూలు చేయనున్న ట్రాయ్?

కోట్లాది మంది మొబైల్స్ ను వాడుతున్నారు. మొబైల్ యూజర్లకు షాక్ ఇవ్వనున్నది టెలికాం నియంత్రణ సంస్థ. ఇక ఫోన్ నంబర్ కు ఛార్జీ వసూలు చేయనున్నది ట్రాయ్.

కోట్లాది మంది మొబైల్స్ ను వాడుతున్నారు. మొబైల్ యూజర్లకు షాక్ ఇవ్వనున్నది టెలికాం నియంత్రణ సంస్థ. ఇక ఫోన్ నంబర్ కు ఛార్జీ వసూలు చేయనున్నది ట్రాయ్.

మొబైల్ యూజర్లకు బిగ్ షాక్ ఇవ్వనుంది టెలికాం నియంత్రణ సంస్థ. ఇప్పటి వరకు ఫ్రీగా సిమ్ కార్డు పొందేందుకు ఇక ఛార్జీలు చెల్లించే పరిస్థితి రానున్నది. స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వచ్చాక మొబైల్ వాడకం ఎక్కువై పోయింది. కొంతమంది రెండు ఫోన్లను కూడా యూజ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నంబర్లను వాడుతున్నారు. టెలికాం కంపెనీలు సైతం మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు కస్లమర్లకు ఫ్రీగా సిమ్ కార్డులను అందిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఫోన్ నంబర్ల దుర్వినియోగం.. భద్రతాపరమైన ముప్పు కూడా తలెత్తుతుండడంతో ఒక వ్యక్తికి ఫోన్ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి విధించింది ప్రభుత్వం. ఈక్రమంలో ట్రాయ్ కొత్త సిఫార్సులను రెడీ చేసింది.

ఫోన్ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేసేందుకు ట్రాయ్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది ట్రాయ్. దీనికి కేంద్రం ఓకే చెబితే ముందుగా మొబైల్ ఆపరేటర్ల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఆ తర్వాత కంపెనీలు యూజర్ల నుంచి రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ నంబర్ల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అదేవిధంగా రెండు సిమ్ కార్డులను వినియోగిస్తున్నవారు ఒకదానికే రీఛార్జ్ చేస్తూ.. రెండోదాన్ని రీఛార్జ్ చేయడం లేదు. అలాగే తమ కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో టెలికాం కంపెనీలు సైతం ఆయా నంబర్లను తొలగించడం లేదు.

దీంతో తక్కువ వినియోగం గల ఫోన్ నంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు జరిమానాలు సైతం విధంచాలని ట్రాయ్ భావిస్తోంది. గత ఏడాది 2023, డిసెంబర్‌లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ నంబర్లకు ఛార్జీలు వసూలు చేసే అంశం ఉంది. అయితే ఫోన్ నెంబర్ కు ఒక్కసారే ఛార్జీ వసూలు చేయాలా లేదా నంబరింగ్ సిరీస్ కు ప్రతి ఏడాది ఛార్జీ వసూలు చేయాలా అనే దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఒక వేళ ట్రాయ్ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే మొదట్లో సిమ్ కార్డులకు డబ్బు చెల్లించినట్లుగానే ఇకపై కూడా సిమ్ కార్డులకు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

Show comments