విద్యార్థులకు గుడ్ న్యూస్! వచ్చే ఏడాది అంతా భారీగా సెలవులు! ఇక పండగే!

విద్యార్థులకు గుడ్ న్యూస్! వచ్చే ఏడాది అంతా భారీగా సెలవులు! ఇక పండగే!

త్వరలో సమ్మర్ హాలీడేస్ ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాకు సంబంధించిన ఏదో ఒక సమాచారం వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ విద్యాసంస్థల అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది.

త్వరలో సమ్మర్ హాలీడేస్ ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాకు సంబంధించిన ఏదో ఒక సమాచారం వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ విద్యాసంస్థల అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది.

సమ్మర్ హాలీడ్ లో విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ వేసవి కాలం సెలవులు ముగియనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి తమ బంధువుల ఊర్లకు వెళ్లిన వారు..తిరిగి తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. జూన్ 12వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ విద్యాసంస్థల అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమి, ఉన్నత పాఠశాలకు సంబంధించిన విద్యాసంవత్స క్యాలెండర్ ను రేవంత్ రెడ్డి సర్కార్ నేడు విడుదల చేసింది. ఇక మొత్తంగా సెలవులు ఎన్ని, పనిదినాలు ఎన్ని, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

త్వరలో సమ్మర్ హాలీడేస్ ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాకు సంబంధించిన ఏదో ఒక సమాచారం వస్తూనే ఉంటుంది. అలానే ఎడ్యూకేషన్ కి సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మే 25 శనివారం తెలంగాణ విద్యాశాఖ.. అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2024-25 విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలల పని దినాలు జరగనున్నాయి. విద్యా సంస్థలు జూన్‌ 12న పునఃప్రారంభమై.. 2025 ఏప్రిల్‌ 23న ముగియనున్నాయి.

ఇలా 2024-25 విద్యాసంవత్స క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది. 2025 ఏప్రిల్‌ 24 నుంచి అదే ఏడాది జూన్‌ 11 వరకు వేసవి కాలం సెలవులు ఉన్నాయి. అంటే ఈ సారి 49 రోజులు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఇక పండగలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో పేర్కొన్నారు. విజయ దశమి సందర్భంగా దసరా సెలవులు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ మొత్తం 13 రోజుల పాటు ఉంటాయని విద్యా శాఖ పేర్కొంది. అదే విధంగా పొంగలు హాలిడేస్ ను 2025 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు ప్రకటించింది. ఇవి మొత్తం 6 రోజులు ఉంటాయని తెలిపింది. ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాలు యోగా, మెడిటేషన్ తరగతులు ఉండనున్నాయి.

ఇక పరీక్షల విషయానికి వస్తే.. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలను 2024 జూలై 31 లోపు నిర్వహించనున్నారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలను 2024సెప్టెంబర్‌ 30 జరపనున్నారు. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలను దసర పండగకు ముందుగా అక్టోబర్‌ 21 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొంది. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-3ను 2024 డిసెంబర్‌ 12 లోపు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-4ను 2025 జనవరి 29 లోపు నిర్వహించనున్నట్లు అకడామిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. అదే విధంగా సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలను 2025 ఏప్రిల్‌ 9 నుంచి 29 వరకు, 10 తరగతి వారికి ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్స్ ను 2025 ఫిబ్రవరి 28లోపు, SSC బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ల్ ను కూడా విడుదల చేసింది. మొత్తంగా పలు పండగలు, సమ్మర్ హాలీడేస్ కలుపుకుని వచ్చే ఏడాది భారీగానే సెలవులు ఉండనున్నాయి.

Show comments