Raja Singh Lodh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్!

Raja Singh Lodh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్!

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాాబాద్ నగరంలోని గోషామహాల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాాబాద్ నగరంలోని గోషామహాల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

తరచూ సినీ, రాజకీయ నాయకులకు సంబంధించిన వివిధ ఇష్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలానే  కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు వివిధ కేసుల్లో అరెస్టు అవుతుంటారు. ఇటీవలే బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సంఘటనలో హేమ వంటి పలువురు సినిమాలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. ఇది ఇలా ఉంటే.. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరి..ఆయన అరెస్టుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించిన రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ ఘర్షణలో కొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాను మెదక్ వెళ్లనున్నట్లుగా రాజాసింగ్ ప్రకటించారు. ఈ క్రమంలో మెదక్  అల్లర్లను దృష్టిలో పెట్టుకుని రాజాసింగ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన మెదక్ వెళ్తాన్ని ప్రకటించిన నేపథ్యంలో ముంబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ విమానాశ్రయం వద్దనే అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం రాజాసింగ్‌ను పోలీసులు మియాపూర్ అసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లుగా తెలుస్తుంది.

మెదక్ పట్టణంలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. అది కాస్తా వివాదం ఘర్షణలకు దారితీసి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు తీవ్రగాయలయ్యాయి. అలానే  నార్సింగ్ అనే మరో యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. ఈ దాడులకు సంబంధించి రెండు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక అల్లర్లలో పలు షాపులు, వెహికల్ లను ధ్వంసం చేశారు. ఈ మెదక్ జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఐజీ రంగనాథ్‌, ఎస్పీ బాలస్వామిలు బందోబస్తు ఏర్పాట్లు చేసి.. పర్యవేక్షిస్తున్నారు. నేడు బీజేపీ వర్గాలు పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ బంద్ లో పాల్గొనాల్సి ఉందని సమాచారం.  దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకోగానే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show comments