IND vs CAN: నేడు కెనడాతో మ్యాచ్‌.. భారీ మార్పులతో బరిలోకి టీమిండియా!

IND vs CAN: నేడు కెనడాతో మ్యాచ్‌.. భారీ మార్పులతో బరిలోకి టీమిండియా!

India vs Canada, T20 World Cup 2024: గ్రూప్‌ స్టేజ్‌లో నామమాత్రపు మ్యాచ్‌కు టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

India vs Canada, T20 World Cup 2024: గ్రూప్‌ స్టేజ్‌లో నామమాత్రపు మ్యాచ్‌కు టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా నేడు(శనివారం, జూన్‌ 15) టీమిండియా తమ చివరి గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో పసికూన కెనడాతో రోహిత్‌ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది. మూడు వరుస విజయాలతో ఇప్పటికే సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయిన భారత్‌.. కెనడాతో నామమాత్రపు మ్యాచ్‌కు సిద్ధం అవుతుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో ఎలాంటి ప్రభావం ఉండకపోవడంతో.. టీమ్‌లో కొన్ని మార్పులు చేసి.. సూపర్‌ 8కి ముందు కొంతమంది స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌ ఇవ్వాలని రోహిత్‌ భావిస్తున్నట్లు సమాచారం.

గ్రూప్‌-ఏ నుంచి టీమిండియా మూడు విజయాలతో సూపర్‌ 8కు క్వాలిఫై అయింది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం యూఎస్‌ఏ, పాకిస్థాన్‌ పోటీ పడుతున్నాయి. ఇందులో కూడా యూఎస్‌ఏకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. సూపర్‌ 8లో టీమిండియా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లతో పోటీ పడే ఛాన్స్‌ ఉంది. ఆసీస్‌తో మ్యాచ్‌ జూన్‌ 24న డిసైడ్‌ అయిపోయింది. ఈ కీలక మ్యాచ్‌లకు ముందు జట్టులో కొన్ని లోపాలను సరిచేసుకోవాలని చూస్తోంది టీమిండియా. ఈ టోర్నీలో ఇప్పటి వరకు జట్టు బాగా ఇబ్బంది పెట్టిన సమస్య ఓపెనింగ్‌ జోడీ. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడుతున్న కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడు. దీంతో అతనికి కాస్త రెస్ట్‌ ఇచ్చి.. మైండ్‌ రిలాక్స్‌ అయ్యేలా చూడాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కీలకమైన సూపర్‌ 8కు కోహ్లీ ఫామ్‌లో ఉండటంతో ముఖ్యంగా కానుక ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కోహ్లీ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ లేదా సంజు శాంసన్‌ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు సైతం రెస్ట్‌ ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్‌ 8లో మరింత రెచ్చిపోయి బౌలింగ్‌ చేసేందుకు బుమ్రాకు కాస్త రెస్ట్‌ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. బుమ్రాకు రెస్ట్‌ ఇచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ లేదా యుజ్వేంద్ర చాహల్‌లలో ఒకరి టీమ్‌లోకి తీసుకుని సూపర్‌ 8కి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కల్పించాలని చూస్తోంది. ఎందుకంటే.. సూపర్‌ 8 మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయి. అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. నేరుగా సూపర్‌ 8 మ్యాచ్‌ ఆడే బదులు ఒక మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం ఆడిస్తే బాగుంటుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హార్ధిక్‌ పాండ్యాకు కూడా రెస్ట్‌ ఇవ్వొచ్చు. అతను ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. కీలక సూపర్‌ 8కి ముందు గాయపడితే టీమ్‌కు ఇబ్బందులు తప్పవు. అందుకే పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చినా ఇవ్వొచ్చు. అయితే.. ఇండియా వర్సెస్‌ కెనడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది.  మరి ఈ మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments