అమెరికాలో కొత్త వ్యాపారం మెుదలుపెట్టిన టీమిండియా స్టార్ క్రికెటర్!

అమెరికాలో కొత్త వ్యాపారం మెుదలుపెట్టిన టీమిండియా స్టార్ క్రికెటర్!

టీమిండియాకు చెందిన ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఇతర బిజినెస్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో ఓ కొత్త బిజినెస్ ప్రారంభించాడు టీమిండియా యంగ్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియాకు చెందిన ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఇతర బిజినెస్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో ఓ కొత్త బిజినెస్ ప్రారంభించాడు టీమిండియా యంగ్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అంటారు పెద్దలు. ఈ సామెతను చాలా మంది ఒంటబట్టించుకుని రెండు చేతులా సంపాందిస్తున్నారు. ఒక వైపు ప్రొఫెషన్ కెరీర్ లో రాణిస్తూనే.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. అలా టీమిండియాకు చెందిన ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఇతర బిజినెస్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కొత్త బిజినెస్ ప్రారంభించాడు టీమిండియా యంగ్ ప్లేయర్. అమెరికాలోని ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన వికస్ వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టాడు.

టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి వ్యాపారానికి సంబంధించిన విషయంలో న్యూస్ లోకి ఎక్కాడు. టీ20 వరల్డ్ కప్ 2024 కోసం భారత జట్టులో రిజర్వ్ ప్లేయర్ గా గిల్ ఎంపికైన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం టీమిండియాతోనే ప్రయాణిస్తున్న గిల్.. అమెరికాలో ఓ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అమెరికాలోని ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన వికస్ వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టాడు గిల్. ఇందుకు సంబంధించి సదరు సంస్థ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

అందులో..” క్రికెట్ అండ్ టెక్ రెండిట్లోనూ భారతీయ ఆధిపత్యం ఉండటానికి మాతో చేతులు కలిపిన పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. వికస్ వెంచర్స్ అనేది సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ-వినియోగ వస్తువులతో సహా వివిధ రంగాలలో, వినూత్న స్టార్టప్‌లలో వ్యూహాత్మక పెట్టుబడులకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ. నిలకడైన వృద్ధిని సాధించడానికి ఈ సంస్థ కంపెనీలకు వనరులను-నైపుణ్యాలను అందిస్తుంది. మరి క్రికెటర్ గా సూపర్ సక్సెస్ అయిన శుబ్ మన్ గిల్.. బిజినెస్ మెన్ గా ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.

ఇదికూడా చదవండి: SKY సూపర్ ఇన్నింగ్స్.. కానీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు!

Show comments