నీవెవరో - ఓవర్సీస్ రివ్యూ

By iDreamPost.com Aug. 24, 2018, 10:26 am IST
నీవెవరో - ఓవర్సీస్ రివ్యూ

విన్నూతనమైన ప్రమోషన్ల తో,టీజర్ల తో ,వినసొంపైన  సంగీతంతో " నీవెవరో"  సినిమా ప్రమోషన్ల తో సరికొత్తగా ఆకట్టుకొనే ప్రయత్నం ఈ మూవీ కి బాగా కలిసి వచ్చింది, ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన  కోనా కార్పొరేషన్ మరియు ఎంవీవీ సినిమా  వెరైటీ  ప్రోమోలతో,టీజర్ల తో మార్కెట్ లో "నీవెవరో" చిత్రానికి  ఎంతో buz సృష్టించడం తెలిసిందే. ఒక రోజు ముందే  ఓవర్సీస్ లో రిలీజ్ ఆయన ఈ చిత్రం ఎలా వుందో  చూద్దాం ! 

ఈ సినిమా లో హీరో కళ్యాణ్ (ఆది పిని శెట్టి )  బ్లైండ్  చెఫ్ (visually impaired chef-దివ్యానంగుడు) గా  తన స్వంత రెస్టౌరెంట్ ను నడుపుతుంటాడు, ఎంతో సింపుల్ గా తన  మధుర  జీవనం హాయిగా గడిపేస్తూ  ,తల్లితండ్రులతో జీవిస్తుంటాడ. కళ్యాణ్ కి అనూ అనే  రిపోర్టర్ మిత్రురాలుగా ఉంటుంది ,అనూ(రితికా సింగ్ ) కు కళ్యాణ్ అంటే సానుభూతితో పాటు ప్రత్యేకంగా ఇష్టపడుతూ ఉంటుంది . ఆలా సాగిపోతున్న ఆది జీవితం లోకి  ఒకరోజు సడన్ గా వెన్నెల (తాప్సి )  అనే కస్టమర్ రెస్టౌరెంట్ లోకి వస్తుంది . కొంత పరిచయం అయ్యాక  కళ్యాణ్ ను ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతుంది ,కళ్యాణ్ తనసహాయం ద్వారా  ఆమెను అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకొస్తాడు. ఇంతలో విధి వక్రీకరించి కళ్యాణ్ కు ఆక్సిడెంట్ జరిగి కొద్దిరోజుల తరువాత మునుపటి చూపు వస్తుంది .  అయితే ఆతరువాత  వెన్నెల అకస్మాత్తుగా   కనపడక పోగా ,ఆమెకోసం రోజుల తరబడి  అన్నిచోట్లా వెతుకుతాడు కానీ అతని ప్రయత్నం సఫలీకృతం కాదు .ఇక నిరాశకు గురై ,నార్మల్ లైఫ్ లో  ఆనూకి దగ్గరై ,ఆమెతో  చనువు పెరిగి ఆమెతో పెళ్ళికి సిద్దపడుతాడు,పెళ్లి దగ్గర పడుతుండగా తన ప్రేయసి వెన్నెల బ్రతికి వుందని ,ఫైనాన్సియర్ ల చేతిలో కిడ్నాప్ కు గురై ఉందని తెలుస్తుంది ,ఇక అక్కడనుంచి సీరియస్ గా హీరో,అజ్ఞాతవాసి విలన్ల మధ్య పోటా పోటీ  మైండ్ గేమ్ నడుస్తుంది.  

ఇక  కళ్యాణ్ ఫైనాన్షియర్ ల వత్తిడి నుంచి  వెన్నెల ను కాపాడగలుగుతాడా? లేదా  విలన్  కళ్యాణ్ నుంచి ఎం ఆశిస్తాడు, ఏం రాబట్టుకొంటాడు అన్నవి సినిమాలో చాలా ఆసక్తిగా మలిచారు?. నీవెవరో కథ కథనం  నిర్దేశించిన పరిధి లోనే నడుస్తుంది . 

లవర్స్ డైరెక్టర్ హరినాథ్ తనదైన శైలి లో ఈ థ్రిల్లర్  సినిమాని కూడా ప్రేక్షకుల్ని లీనమయ్యేటట్లు చేసి వారిని మరింత ఆకట్టుకొనేలా  తన కామెడీ మార్క్ ను వెన్నెల కిశోర్ మరియు సప్తగిరి ల ద్వారా  హాస్యం  పండిస్తూ ఆద్యంతం సరదా గా అద్భుతంగా నడిపించాడు.

డైరెక్టర్ హరినాథ్  అన్ని భావోద్వేగాలను, చెప్పాల్చిన సందేశాలను  తనదైన హాస్యం జోడించి ఆ పాత్రల ద్వారా  చెప్పే ప్రయత్నం గతం లోని లవర్స్ సినిమా లో"మగజాతి ఆణిముత్యం" క్యారెక్టర్  తరహాలో  "నీవెవరో" లో  కూడా  "జణగణ మణ  జగదీశ్" అంటూ సప్తగిరి తో  పాత్రతో  చేయించాడు . 
ఆక్కట్టుకొనేవి :
డైరెక్షన్,కథ ,కథనం ,డైరెక్షన్ ,కెమెరా వర్క్ ,కాన్సెప్ట్ . ,
హరినాథ్  డైరెక్షన్  మరియు  సాయి శ్రీరామ్  ఫోటోగ్రఫీ  వర్క్  హై లెట్ గా నిలుస్తాయి .   
పాత్రలు : అన్ని పాత్రలు వాటి పరిధి మేరకు సమకూరాయి 
ముఖ్యంగా  డైరెక్టర్స్  హీరో  ఆది  దివ్యాంగుడు పాత్రలో  ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు . 
తాప్సి ,ఆది ల  రొమాంటిక్ కాంబినేషన్ బాగా పండింది 
రితికా సింగ్ తన పాత్ర పరిధి కనుగుణంగా తనని ఆవిష్కరించుకొన్నది . 

ఈ సినిమా మొత్తం మన ఉభయ  తెలుగు రాష్ట్రాల్లోనే ,హైదరాబాద్ ,విజయవాడ మరియు వైజాగ్ లలోనే  నిర్మించడం ద్వారా కోనా కార్పొరేషన్  మరియు ఎంవీవీ సంస్థలకు పొదుపు బడ్జెట్ తో  డైరెక్టర్ హరినాథ్ తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

డైరెక్షన్ : తెలుగు లో నూతన దర్శకుల శకం మొదలై అనేక నూతన కాన్సెప్ట్స్ ల తో  విభిన్నముగా , adult  కంటెంట్ కు పెద్ద పీట  వేస్తూ  సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఆ మూసలో పడకుండా  "నీవెవరో" ను హృదయానికి తాకేలా  కొత్త  శైలీ లో డైరెక్టర్ హరినాథ్  ఏమాత్రం అశ్లీలం లేకుండా వినోదాత్మకం  గా కుటుంభంతో చూడగలిగే  సినిమా లాగా మలిచడం అభినందనీయం . ఒక్క మాటలో చెప్పాలంటే  సున్నితమైన భావోద్వేగాలను సృశిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా తీయడం లో హరి నాథ్ విజయవంతము అయినట్లే 

మ్యూజిక్  :
అన్నిపాటలు బాగా నచ్చుతాయి . భాస్కర్ భట్ల  మరియు శ్రీజో లు  పాటలకు అవసరమైన  మంచి సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా వెన్నెలా ఓ వెన్నెలా ... నా నీడై నడిచే నేస్తం నీ వయ్యావేలా  మరియు  ...   ఓచెలి ఓ చెలి    ఎక్కువ కాలం  గుర్తుంటాయి . మరో రెండు పాటలు ప్రేమికుడి భావోద్వేగంతో  పాడే  "ఏంటో ఇలా  ఏమయిందో నా మనసుకు.. " మరియు  ప్రేమికుడి  విరహవేదనతో  " రాక్షసివి  ---రాక్షసివి"   అంటూ  పాడే   పాటలు  బాగా  నచ్చుతాయి. సినిమాలో  సందర్భాను సారం "నినుకోరి" సినిమా పాటలని తలపించేలా  మంచి సాహిత్యం ,సంగీతం  ఆకట్టుకొంటుంది. వందనా  శ్రీనివాస్ మరియు సీడ్ శ్రీరామ్ లు అద్భుతంగా పాడారు . 

అన్నీ క్రాఫ్ట్ లను సమన్వయ పరుస్తూ , అవసరం మేరకు అన్ని పాత్రలను నుంచి  తనకు కావాల్చింది రాబట్టుకోవడం లో హరి నాథ్  సఫలమయినాడు. సినిమా మీద మొదటి నుంచి చివరిదాకా  అత్యంత శ్రద్ధతో తీసినట్లు తెలుస్తుంది . 

Reviewed by Gopi Chillakuru

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates