గూఢచారి రివ్యూ

By iDreamPost.com 03-08-2018 05:18 PM
గూఢచారి రివ్యూ
Rating : 3.5/5
Cast : Prakash Raj, Adivi Sesh, Sobhita Dhulipala
Directed by : Sashi Kiran Tikka
Produced by : Abhishek Pictures
Music : Sricharan Pakala
Release Date : 2018-08-03

అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం’ గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

గోపీ (అడివి శేష్) తండ్రి రఘువరన్ త్రినేత్ర నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా పనిచేస్తూ టెర్రరిస్టుల చేతులో చనిపోతాడు. దాంతో గోపీకి టెర్రరిస్టుల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదని గోపీ మామయ్య సత్య (ప్రకాష్ రాజ్ ) గోపీ పేరును అరుణ్ కుమార్ గా మార్చి త్రినేత్ర కి దూరంగా పెంచుతాడు కానీ గోపీ మాత్రం తన తండ్రి మీద ఇష్టంతో తాను కూడా తన తండ్రి లాగే దేశం కోసం పని చేయాలని చాలా బలంగా కోరుకుంటాడు. కానీ సత్య (ప్రకాష్ రాజ్)కి ఇది ఇష్టం ఉండదు.దాంతో గోపీ సత్యాకి తెలియకుండా తన తండ్రి రఘువరన్ పేరు వాడుకొని త్రినేత్రలో జాయిన్ అయి ట్రైన్ అవుతుంటాడు ఈ క్రమంలో సమీరా (హీరోయిన్ శోభిత) గోపీ లైఫ్ లోకి వస్తోంది
అంతలో త్రినేత్ర అధికారులను టెర్రరిస్ట్ లు అతి దారుణంగా చంపేసి ఇదంతా చేసింది గోపి అని నమ్మిస్తారు. దాంతో త్రినేత్ర అధికారులు, పోలీస్ లు గోపి వెంట పడతారు. గోపి వారి నుండి ఎలా తప్పించుకున్నాడు ? తను నిర్దోషి అని ఎలా నిరూపించుకున్నాడు ? అసలు ఇది అంతా చేస్తుంది ఎవరు ?అని తెలుసుకున్నే క్రమంలో తన తండ్రి బతికే ఉన్నాడని తేలుస్తోది. మరి ఎందుకు చనిపోయాడని నమ్మించారు ? అసలు తన తండ్రి ఎవరు ? తన తండ్రికి తాను ప్రేమించిన సమీరాకు సంబంధం ఏమిటి ? చివరకి గోపి నిర్దోషిగా బయట పడ్డడా ? లాంటి విషయాలు తెలియాలంటే గూఢచారి చిత్రం చూడాలసిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే రచయితగానే కాకుండా హీరోగా కూడా నటించిన అడివి శేష్ తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్స్ తో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని అడివి శేష్ సెటిల్డ్ గా చాల చక్కగా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మిస్ ఇండియా, తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు ఆమె నటన మెచ్చుకోదగినది.

ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ సుప్రియా యార్లగడ్డ, త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి పని చేసే మిస్టీరియస్ ఏజెంట్ అయినా నదియా ఖురేషీ పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఎప్పటిలాగే వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, అనిష్ కురువిల్ల, మధు శాలిని కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

చిన్న చిత్రం అయినా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాప్రమైజ్ అవ్వకుండా మంచి సాంకేతిక విలువలతో వివిధ ఎక్కువ లొకేషన్స్ లో సినిమాను అత్యుత్తమంగా రూపొందించే ప్రయత్నం చేసిన ఈ గూఢచారి” చిత్రబృందాన్ని అభినందించి తీరాలి. పైగా హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓన్లీ తెలుగు సినిమాలను మాత్రమే చూసే ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ను ఇస్తుంది.

మైనస్ పాయింట్స్ :

కథను బాగానే తయారుచేసుకున్న దర్శక రచయితలు సెకండ్ హాఫ్ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే గూఢచారి ఇంకా ఆకర్షణీయంగా తయారయి ఉండేది.

ముఖ్యంగా సెకెండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ రచయితలు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదనిపిస్తోంది.

సాంకేతిక విభాగం :

మంచి కథను రాసుకోవడంలో సక్సెస్ అయిన దర్శక రచయితలు ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో కాస్త నెమ్మదించారు. సినిమాకు పనిచేసిన విఎఫ్ఎక్స్ టీమ్ పని తనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకుంది.

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. కొన్ని పాటలు బాగా ఆకట్టుకోగా ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. శనీల్ డియో సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకోదగినది. ఎక్కువ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎక్కడా బ్యూటీ తగ్గకుండా తీర్చి దిద్దారు అయన.

ఎడిటర్ గారి బి.హెచ్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అత్యవసరం కాని కొన్ని సీన్స్ విషయంలో ఆయన తన కత్తెరకు ఇంకా పని చెప్పి ఉండాల్సింది. నిర్మాతలు అభిషేక్ నమ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అడవి శేష్ ఆలోచనను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలను అభినందించాలి.

తీర్పు :

‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న అడివి శేష్ ఈ సారి గూఢచారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. సస్పెన్సు చివరి వరకు మెయింటైన్ చేస్తూ చాల ఉత్కంఠభరితంగా సాగుతూ తండ్రి కొడుకుల మధ్య మంచి సంఘర్షణతో ఈ చిత్రం మెప్పిస్తోంది. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారికి మరియు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.

Reviewed by 123telugu Team

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Recent Reviews

Latest Updates