చిలసౌ రివ్యూ

By iDreamPost.com 03-08-2018 05:11 PM
చిలసౌ రివ్యూ
Rating : 3.25/5
Cast : Sushanth, Ruhani Sharma, Vennela Kishore
Directed by : Rahul Ravindran
Produced by : Nagarjuna Akkineni
Music : Prasanth R. Vihari
Release Date : 2018-08-03

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్, రుహాణి శర్మ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం చి ల సౌ . ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్ (సుశాంత్ ) కు పెళ్లి అంటే ఇష్టం ఉండదు . ఆయన తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా పెళ్లి చేయాలని ఒక రోజు వాళ్లింట్లోనే హీరోయిన్ అంజలి ( రుహాణి శర్మ ) తో పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో సుశాంత్ ఎలాగైనా అమ్మాయికి నో చెప్పి పంపించాలనుకుంటాడు పెళ్లి చూపులకు సుశాంత్ ఇంటికి వచ్చిన అంజలి కి కూడా పెళ్లి అంటే అస్సలు ఇష్టం ఉండదు కాని పెళ్లి చేసుకోకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయం తో ఒప్పుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది. అంజలి, అర్జున్ ల పెళ్లి జరిగిందా లేదా అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఇది మొదటి సినిమానే అయినా ఎంతో అనుభవం వున్నా డైరెక్టర్ లా ఈ కథను తెరకెక్కించాడు. ఒకే ఒక్క రాత్రిలో సినిమా ను డీల్ చేసిన విధానం బాగుంది. ఇక అర్జున్ పాత్రలో నటించిన సుశాంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. అంజలి పాత్రలో నటించిన రుహాణి కి ఇది మొదటి సినిమా అయినా అద్భుతంగా నటించింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు.

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథను ఎంచుకున్న దర్శకుడు రాహుల్ ఇంకొంచెం కమర్షియల్ అంశాలను జోడిస్తే అవుట్ ఫుట్ వేరేలా ఉండేది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను విసిగిస్తాయి. సినిమాకు బలంగా నిలిచినవెన్నెల కిషోర్ పాత్రను ఇంకొంచెం పొడిగించాల్సి ఉండేది. రెండవ భాగాన్నిబానే డీల్ చేసిన దర్శకుడు మొదటి భాగంలో పట్టు కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఇంకొంచెం బలంగా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రొటీన్ కథను ఎంచుకున్న దాన్ని తెరకెక్కించే విధానంలో ఎక్కడా తడబడలేదు. కథ కూడా ఇంకొంచెం ఆసక్తికరంగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్న పాటలు మాత్రం అంతగా రిజిస్టర్ అవ్వవు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సుకుమార్ అందించిన ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాకు అవసరమైంత మేర ఖర్చు పెట్టారు.

తీర్పు :

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ అందమైన, ఆహ్లాదకరమైన ప్రేమ కథను అందించారు. సగటు ప్రేక్షకుడ్ని ఆకట్టుకునేలా కథను, పాత్రల్ని తయారుచేసుకున్న ఆయన మంచి లవ్ ట్రాక్, ఫన్ ను అందించారు. కానీ కొన్ని చోట్ల సన్నివేశాలను సాగదీయకుండా, ప్రేమ కథలో ఇంకాస్త బరువును పెంచి ఉంటే బాగుండేది. మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుందనడంలో సందేహం లేదు.

Reviewed by 123telugu Team

idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Recent Reviews

Latest Updates