హ్యాట్రిక్ హీరో కానీ.. పొలార్డ్ చేతిలో బలయ్యాడు...

By Rishi K Mar. 04, 2021, 12:12 pm IST
హ్యాట్రిక్ హీరో కానీ.. పొలార్డ్ చేతిలో బలయ్యాడు...

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి యువరాజ్ & గిబ్స్ సరసన నిలిచిన పొలార్డ్..

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డును హర్ష్‌లీగిబ్స్‌, టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సాధించారు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన పొలార్డ్ ధాటికి 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 131/9 స్కోర్‌ సాధించింది. వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. పాతుమ్‌ నిస్సంక(39; 34 బంతుల్లో 4x4), డిక్‌విల్లా(33; 29 బంతుల్లో 3x4, 1x6) పోరాటంతో స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్(26;15 బంతుల్లో 3×4,2×6) ఎవిన్ లూయిస్(28; 10 బంతుల్లో 2×4,3×6) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 3.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకుంది.

హ్యాట్రిక్ హీరోని దంచి కొట్టిన పొలార్డ్

విజయం దిశగా సాగుతున్న వెస్టిండీస్ కి అకిల ధనంజయ పెద్ద షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో లూయిస్,క్రిస్ గేల్, పూరన్ వికెట్లను తీసి t20 ల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో శ్రీలంక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. కాగా హ్యాట్రిక్ సాధించానన్న ఆనందం ధనంజయకు ఎంతో సేపు నిలవలేదు. ధనంజయ వేసిన ఆరో ఓవర్లో పొలార్డ్(38; 11 బంతుల్లో 6x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడంతో నాలుగు ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో విండీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరుసటి ఓవర్లో పొలార్డ్ అవుటయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగిలిన పనిని జాసన్ హోల్డర్(29,24 బంతుల్లో 1×4,2×6) పూర్తి చేశాడు.

గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సులు రెండుసార్లు నమోదయ్యాయి. మొదటిది 2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా నెదర్‌లాండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచులో నమోదయింది. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా ఆటగాడు హర్ష్‌లీగిబ్స్‌ ఆరు బంతులను స్టాండ్స్ లోకి తరలించిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించగా అదే ఏడాది t20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు సాధించిన మొదటి t20 క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. వీరిద్దరి తర్వాత పొలార్డ్ శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టి వారిద్దరి సరసన నిలిచాడు. కాగా విధ్వంసక ప్రదర్శన చేసిన పొలార్డ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. హ్యాట్రిక్ అనంతరం ఆరు సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ గా అకిల ధనంజయ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp