బిగ్ బ్రేకింగ్: ఐపిఎల్ మళ్ళీ వాయిదా...?

By Venkat G Sep. 22, 2021, 04:31 pm IST
బిగ్ బ్రేకింగ్: ఐపిఎల్ మళ్ళీ వాయిదా...?

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ కరోనా బారిన పడ్డాడు. బుధవారం అతనికి ఆర్‌టి-పిసిఆర్ పరీక్ష నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా బారిన పడినట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఒక ప్రకటనలో తెలిపింది. నటరాజన్ ఐసోలేషణ్ కు వెళ్ళాడని పేర్కొంది. అతనికి ప్రస్తుతానికి ఏ లక్షణాలు కనపడటం లేదని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తో నేడు హైదరాబాద్ జట్టు ఆడుతున్న సంగతి తెలిసిందే.

కరోనా కేసు బయటపడటం తో మ్యాచ్ నిర్వహిస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరుగుతుందని, ఇతర ఆటగాళ్లకు కరోనా రాలేదని బోర్డ్ వివరించింది. ఆల్ రౌండర్ విజయ్ శంకర్, టీమ్ మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్ జె, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్ మరియు నెట్ బౌలర్ పెరియసామి గణేషన్ ప్రస్తుతం జట్టులో కలవలేదు. ప్రస్తుతం ఐపిఎల్ లో ఆడే ఆటగాళ్ళు అందరూ బయో బబుల్‌లో ఉన్నారు.

అంతకుముందు మేలో ఇలాగే కరోనా కేసులు బయటపడటం తో... మ్యాచ్ లను రద్దు చేసి దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సడెన్ గా కరోనా కేసులు నమోదు కావడంతో టోర్నీ మరోసారి నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇతర జట్ల ఆటగాళ్ళకు కూడా పరిక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఢిల్లీ జట్టుతో తలపడే హైదరాబాద్ ఆటగాళ్లకు కూడా ముందుగా పరిక్షలు నిర్వహించారు. నేడు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. బోర్డు చెప్పినా సరే మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు ఉన్నాయి.

Also Read : 22 ఏళ్ళ కుర్రాడు, టెక్నిక్ తో ముప్పతిప్పలు పెట్టాడు...!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp