IPL2021 DC vs KKR Qualifier 2- సౌత్ లాంగ్వేజ్ లో నార్త్ కు దినేష్ కార్తిక్ చుక్కలు, తమిళంతో ఢిల్లీకి నరకం చూపించాడే...!

By Venkat G Oct. 13, 2021, 10:00 pm IST
IPL2021 DC vs KKR Qualifier 2- సౌత్ లాంగ్వేజ్ లో నార్త్ కు దినేష్ కార్తిక్ చుక్కలు, తమిళంతో ఢిల్లీకి నరకం చూపించాడే...!

అరె ఈ బాల్ అయినా ఫోరు కొట్టరా... నీ పుణ్యం ఉంటది వచ్చే ఓవర్ లో అన్నా కనీసం పది పరుగులు అయినా చేయండి రా... అరె నరేన్ గా అదేం బౌలింగ్ రా... అన్నా నాకు మోర్గాన్ ను చూస్తుంటే పిచ్చి కోపం వస్తుంది, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అంత టఫ్ గా ఉందేంటి అన్నా... ఫెర్గుసన్ బౌలింగ్ కూడా అలా ఉందేంటి... హిట్ మేయర్ కొట్టాలి ఇక దిక్కు లేదు... అక్షర్ పటేల్ కి హ్యాండ్ పవర్ ఎక్కువ ఊపితే బాగుండు, ధావన్ కనీసం ఓవర్ కి రెండు ఫోర్లు కొట్టినా చాలు... ఒరేయ్ అయ్యర్... నీ పుణ్యం ఉంటది... కొడితే కొట్టు లేదా ఔట్ అయినా అవ్వరా...

ఢిల్లీ ఫాన్స్ పరిస్థితి ఇది.. ఎలిమినేటర్ మ్యాచ్ లో కలకత్తా బౌలింగ్ చూసి ఏడుపు ఒకటే తక్కువ. బెట్టింగ్ వేసిన వాళ్లకు అయితే మైండ్ పని చేయలేదు... ఈ బాల్ కొడతారు వచ్చే ఓవర్ కొడతారు అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా అనుకున్నది జరగలేదు. పిచ్ మహిమో లేక కలకత్తా బౌలర్ల ప్రతిభో గాని ఢిల్లీ కి చుక్కలు కనిపించాయి. ఫోరుకే దిక్కు లేదు రా అయ్యా అంటే సిక్సు కోసం చూసారు ఫ్యాన్సు. ఇక్కడి వరకు తిరుగు లేకుండా వచ్చిన ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో పోరాటం గట్టిగా చేయాలని చూసింది.

కాని మోర్గాన్ కెప్టెన్సీ దెబ్బకు మైండ్ పని చేయలేదు. ఎటు కొడదాం అన్నా ఫీల్డర్ కనపడుతున్నాడు. బాల్ గాల్లోకి లేపాలి అంటే దూరం వెళ్తుందో లేదో తెలీదు... ఎంత బలంగా ఊపినా ఫోర్ వెళ్ళడం లేదు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా స్వేచ్చగా ఆడలేదు. ప్రతీ ఒక్క బ్యాట్స్మెన్ ని చాలా కట్టడి చేసింది మోర్గాన్ కెప్టెన్సీ. పిచ్ స్పిన్ కి అనుకూలించడంతో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ను చాలా తెలివిగా వాడుకున్నాడు. ముందు ఇద్దరితో ఆరు ఓవర్లు వేయించి... 15 ఓవర్ల తర్వాత కూడా నమ్మకంగా స్పిన్నర్లకు ఇచ్చుకున్నాడు.

ఇద్దరూ ఎనిమిది ఓవర్లు చాలా బాగా వేసారు. పేస్ కంటే స్పిన్ కి అనుకూలంగా ఉండటంతో పేసర్లు కూడా లైన్ అండ్ లెంత్ వేస్తూ... నిదానంగా బంతులు విసిరారు. శివం మావీ తన వేగం మొత్తం తగ్గించుకుని వైవిధ్యం చూపించి బంతులు విసిరాడు. ఢిల్లీ జట్టులో ఇద్దరు మాత్రమే మూడు పదుల స్కోర్ చేసారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేస్తున్న సమయంలో దినేష్ కార్తిక్ తమిళంలో సలహాలు ఇవ్వడం బాగా హైలెట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ కు తమిళం రాకపోవడంతో అతనికి ఏ విధంగా బంతులు వేయాలో తమిళంలో చెప్పాడు.

కర్ణాటక వాడు కాబట్టి వరుణ్ కూడా చక్కగా సహకరించాడు. పృధ్వీ షా ముందు దూకుడుగా ఆడినా, ధావన్ తెలివిగా ఆడాలని చూసినా, తురుపు ముక్క అని భావించిన స్తోయిన్స్ మీద నమ్మకం పెట్టుకున్నా... శ్రేయాస్ అయ్యర్ స్లో గా ఆడి చెలరేగుతాడు అనుకున్నా... కెప్టెన్ పంత్ సిక్సులు ఉంటాయి అనుకున్నా... కలకత్తా బౌలర్ల దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి. 135 పరుగులు అష్ట కష్టాల మీద చేసారు. ఇందులో 16 పరుగులు అద్రుష్టంతో వచ్చినవే. వరుణ్ చక్రవర్తి బంతికి హిట్ మేయర్ అవుట్ అయినా నో బాల్ కావడంతో బ్రతికి పోయాడు... ఆ తర్వాత అతను వచ్చి రెండు సిక్సులు బాదాడు. ఇక పంత్ కొట్టిన ఒక ఫోర్... శివం మావీ మిస్ ఫీల్డ్ వల్లనే వచ్చాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ మ్యాచ్ లో మోర్గాన్ కెప్టెన్సీ, దినేష్ కార్తిక్ కీపింగ్ బాగా హైలెట్ అయ్యాయి. సౌత్ లాంగ్వేజ్ లో నార్త్ కు చుక్కలు చూపించాడు దినేష్ కీపింగ్ తో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp