ఫిక్సింగ్ టాక్: ఐపిఎల్ లో మళ్ళీ ఫిక్సింగ్ ప్రకంపనలు...?

By Venkat G Sep. 22, 2021, 10:00 pm IST
ఫిక్సింగ్ టాక్: ఐపిఎల్ లో మళ్ళీ ఫిక్సింగ్ ప్రకంపనలు...?

ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఫిక్సింగ్ విషయంలో ఏ మాత్రం సహించడం లేదు. ఆరేళ్ళ క్రితం శ్రీశాంత్ సహా కొందరి ఆటగాళ్ళ విషయంలో ఏ విధంగా వ్యవహరించింది అనేది మనం చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోర్ట్ ల చుట్టూ తిరిగినా సరే శ్రీశాంత్ జాతీయ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. షబీర్ హుస్సేన్ షేఖదాం ఖండ్వావాలా నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం (ఏసియు) ఇప్పుడు ఐపిఎల్ మీద ఎక్కువగా నిఘా పెట్టింది. ఆటగాళ్ళ అనుమానాస్పద కదలికల మీద జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.

తాజాగా ఒక వ్యవహారం ఐపిఎల్ లో సంచలనంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ మ్యాచ్ కు ముందు... మంగళవారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పోస్ట్ అవినీతి నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘిస్తుందా లేదా అనే దాని మీద బృందం ఇప్పుడు గట్టిగా ఫోకస్ చేసింది. వాస్తవానికి మ్యాచ్ టాస్ వేసే వరకు కూడా టీం లో ఎవరు ఉంటారు ఏంటీ అనేది తెలియదు. కాని దీపక్ హుడా పోస్ట్ చేసిన పోస్ట్ తో అతను టీం లో ఉన్నాడు అనేది తెలిసింది.

Also Read: బిగ్ బ్రేకింగ్: ఐపిఎల్ మళ్ళీ వాయిదా...?

జట్టు కూర్పు గురించి సోషల్ మీడియాలో ఆటగాడి ద్వారా ఏ విధమైన చర్చ జరగకూడదు. ఈ పోస్ట్ ని అవినీతి నిరోధక విభాగం పరిశీలిస్తుందని అతన్ని కూడా విచారిస్తామని, ఏమైనా తేడా ఉంటే మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయని ఒక అధికారి మీడియాకు చెప్పాడు. రాత్రి టీం లో దీపక్ హుడా ఉండగా... తాను టీం లో ఉన్నట్టు, బ్యాటింగ్ కి వస్తున్నట్టు సంకేతాలు ఇచ్చాడు.

డైరెక్ట్ మెసేజ్‌లలో అభిమానులు మరియు ఫాలోవర్స్ నుంచి ప్రశ్నలకు సంబంధించి ఇచ్చే రిప్లైలకు ఎటువంటి మార్గదర్శకాలు ఉన్నాయా అని మీడియా అతన్ని ప్రశ్నిస్తే... చేసేవి చేయకూడనివి కచ్చితంగా మార్గదర్శకాల రూపంలో ఆటగాళ్లకు అందించామని చెప్పారు. సోషల్ మీడియా విషయంలో అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తమ సోషల్ మీడియా టీం లు... అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నా సరే వాటి మీద ఏ మాత్రం కూడా అలసత్వం వద్దని హెచ్చరించారు. ఆటగాళ్లకు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం కచ్చితంగా తమ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది అని ఆయన తెలిపారు.

Also Read:22 ఏళ్ళ కుర్రాడు, టెక్నిక్ తో ముప్పతిప్పలు పెట్టాడు...!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp