ట్రంప్‌కు మరో షాక్‌ - యూట్యూబ్ ఛానెల్ వారం సస్పెండ్

By Rishi K Jan. 13, 2021, 01:30 pm IST
ట్రంప్‌కు మరో షాక్‌ - యూట్యూబ్ ఛానెల్ వారం సస్పెండ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్‌పై సామాజిక మధ్యమాలన్నీ ట్రంప్‌ను బ్లాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రంప్ ఖాతాను ట్విటర్‌ శాశ్వతంగా సస్పెండ్ చేయగా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తాత్కాకలింగా బ్యాన్ చేసాయి. తాజాగా ఈ జాబితాలోకి యూట్యూబ్ కూడా చేరింది. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ను వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసిన వీడియోలు హింసను ప్రేరేపించే అవకాశం ఉందని యూట్యూబ్ పాలసీ విధానాలకు విరుద్ధంగా వీడియోలో కంటెంట్ ఉందని యూట్యూబ్ ఒక వారం పాటు ట్రంప్ యూట్యూబ్ ఛానెల్ ను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోలను తొలగించింది. ఈ సస్పెన్షన్‌ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని యూట్యూబ్ ప్రతినిధి వెల్లడించారు.

ట్రంప్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన కంటెంట్ హింసను ప్రేరేపించే విధంగా ఉందని ట్రంప్ ఛానల్‌ను తొలగించాలని, కఠినచర్యలు తీసుకోవాలని స్టాప్‌ హేట్ ఫర్ ప్రాఫిట్ ఉద్యమ సంస్థ ఆందోళన చేయడమే కాకుండా వాణిజ్య ప్రకటనలను నిలిపివేసే ప్రచారం చేపడుతామని హెచ్చరించడంతో యూట్యూబ్ దిద్దుబాటు చర్యలకు పూనుకుని ట్రంప్ ఛానెల్ ను వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp