పరిహారంపై ‘పచ్ఛ’విషం..!

By P. Kumar Aug. 10, 2020, 06:45 pm IST
పరిహారంపై ‘పచ్ఛ’విషం..!

పరిహారం పోయిన ప్రాణాలను తెచ్చివ్వదు. కానీ, సొంత వారిని కోల్పోయి హృదయ విదారకంగా మారిన జీవితాలకు కాస్త సాంత్వన చేకూరుస్తుంది. భవిష్యత్‌పై భరోసా అందిస్తుంది. అయితే నిత్యం పొలిటిల్‌ ప్రాఫిట్‌ కోసం పరితపించే పచ్ఛ మీడియా స్వర్ణా ప్యాలెస్‌ దుర్ఘటనలో మృతి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారంపైనా విషం కక్కుతున్నాయి. తద్వార స్వార్థ రాజకీయం కోసం మానవత్వాన్నే మంటగలపుతున్నాయి.

మనకు హ్యుమానిటీని ప్రేమించే నాయకులు కావాలి కానీ, పబ్లిసిటీపై మోజున్న వారు కాదు. మనకు న్యాయాన్ని ప్రేమించే నాయకులు కావాలి, కానీ డబ్బుపై వ్యామోహం ఉన్న వారు కాదు.

పై స్టేట్‌మెంట్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులకు సరిగ్గా సరిపోతుంది. ఇద్దరిలో ఎవరిది ఏ పంథానో, ఎవరిది ఏ విధానమో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తాజాగా విజయవాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేయడంతోపాటు ఘటనపై సత్వర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి నుంచి సాధారణ ప్రజల వరకు ఈ ఘటనపై మానవత్వంతో స్పందిస్తుంటే కొందరి రాజకీయ అవసరాల కోసమే పనిచేస్తున్న మీడియా సంస్థలు, పచ్ఛ తమ్ముళ్లు మృతులు–వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు. ఇది నిజంగా శోచనీయం.

ప్రభుత్వాధినేతగా మానవత్వంతో స్పందించిన ముఖ్యమంత్రిని అభినందించాల్సింది పోయి ప్రజల సొమ్ము పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నాడంటూ వైఎస్‌ జగన్‌ను మీడియాలోని ఓ వర్గం టార్గెట్‌ చేస్తోంది. అయితే అలా చేస్తున్న వారి జెండా ఏమిటో? అజెండా ఏమిటో? ప్రజలకు తెలియంది కాదు. ప్రభుత్వ పరిహారంలో రాష్ట్ర ప్రజలంతా భాగస్వామ్యులే..! ఇందులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడులకే కాదు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన భాగం ఉంటుంది. కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రజల ప్రతినిధిగా పరిహారాన్ని ప్రకటించారంతే.

రాష్ట్రంలో వివిధ దర్ఘుటనల్లో ప్రాణనష్టం జరిగినప్పుడు వైఎస్‌ జగన్‌ మానవత్వంతో స్పందిస్తున్నారు. భారీ స్థాయిలో పరిహారం ప్రకటించడంతోపాటు దాన్ని సత్వరం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో మృతులకు కోటి రూపాయలు అందించగా, తాజాగా స్వర్ణాప్యాలెస్‌ ఘటనలో మృతి చెందిన వారికి రూ.50 లక్షలు ప్రకటించారు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా ఘటనల్లో మృతి చెందిన వారికి రూ.2 లేదా రూ.3 లక్షలకు మించి దక్కిన దాఖలాలు లేవు. అయితే వైఎస్‌ జగన్‌ ప్రాణాలకు అత్యంత విలువనిస్తూ, భవిష్యత్‌లో మృతుల కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురవ్వకూడదనే ఉద్దేశంతో భారీ పరిహారం ప్రకటిస్తున్నారు. అయితే దీన్ని చూసి కన్నుకుట్టిందో లేక ఓర్వలేనితనమో కానీ కొందరు ఈ అంశాన్నీ రాజకీయం చేయాలని చూస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పరిహారం అందించే విషయంలోనూ చంద్రబాబుకి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడనే భయంతో ప్రజల సొమ్ము పప్పు బెల్లాలు పంచిపెడుతున్నాడంటూ నేతి బీరకాయ నీతులు చెప్తున్నారు.

ప్రయివేట్‌ హాస్పిటల్‌లో చనిపోయిన వారికి ప్రభత్వం ఎందుకు పరిహారం చెల్లించాలి? ఒక వేళ చెల్లించాల్సి వస్తే రమేష్‌ హాస్పిటల్, స్వర్ణా ప్యాలెస్‌ ఓనర్ల నుంచి వసూలు చేసి ఇవ్వాలంటూ విశ్లేషణలు చేస్తున్న వారికి మానవత్వం లేదనుకోవాలి. మన ^è ట్టం పరిధిలో ఒక సాధారణ కేసు పరిష్కారమయ్యేందుకే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అలాంటిది బలమైన ఆర్థిక మూలాలు కలిగిన వారు నిందుతులుగా ఉన్న ఈ కేసులో తీర్పు ఎప్పటికొస్తుంది..! అప్పటి వరకు బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిందేనా...? ఒక వేళ ప్రభుత్వం ఇదే మార్గాన్ని ఎంచుకొని ఉంటే ఇదే మీడియా మానవత్వం లేదా అంటూ కథనాలు వండివార్చేది కాదా? కాబట్టి ఇకనైనా ఈ ద్వంద ప్రమాణాలను పక్కనబెట్టి మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజలు మీడియా రాజకీయాలను ఛీదరించుకొనే రోజు రావడం ఖాయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp