మూత‌ప‌డ్డ వాటిని తెరిపించ‌డ‌మూ త‌ప్పేనా..?

By Kalyan.S May. 06, 2021, 08:30 am IST
మూత‌ప‌డ్డ వాటిని తెరిపించ‌డ‌మూ త‌ప్పేనా..?

ఒక‌రిపై నింద వేయ‌డ‌మే టార్గెట్ అయితే.. అత‌ను ఏమ‌న్నా.. బూతే అన్న‌ట్లుగా వారికి వినిపిస్తుంది. మంచి చేసినా అందులో చెడే క‌నిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, వారి అనుకూల మీడియా తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వంపై అలానే ఉంది. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాన్ని త‌ప్పుప‌ట్ట‌డ‌మే టీడీపీ ల‌క్ష్యంగా మారింది. దానికి వంత పాడ‌డ‌మే ఎల్లో మీడియాకు అల‌వాటుగా మారింది. అమూల్ డైరీకి వ్య‌వ‌హారాన్ని అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏపీలో క్షీర విప్ల‌వాన్ని తీసుకొచ్చింది. ఆ దిశ‌గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా అటువంటి నిర్ణ‌యాన్నే తీసుకుంది. రాష్ట్రంలో మూతపడిన డైరీలను అమూల్ డైరీకి అప్పగించాలని కేబినెట్ భేటీ ఆమోదించింది. మూతపడిన డైరీలను అప్పగిస్తే అమూల్ యాజమాన్యం వాటిని పునరుద్ధరించి తిరిగి వాడుకలోకి తీసుకొస్తుంది. ఈ చర్యవల్ల మళ్ళీ రైతులు లేదా పాడిపై ఆధారపడ్డవారి యాక్టివిటీ మొదలవుతుంది. ప్రతినెల ఎంతోకొంత ఆదాయం కూడా మొదలవుతుంది. స్ధూలంగా ప్రభుత్వ ఉద్దేశ్యం అయితే ఇదే. కానీ టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న మీడియా మాత్రం ఏపి డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆస్తులను అమూల్ కు లీజురూపంలో అప్పగించేస్తున్నట్లు రాసేశాయి.

మూతపడిన డైరీలను అప్పగించటానికి ఏపి డైరీ ఆస్తులను అమూల్ కు అప్పగించటానికి తేడా లేదా ? రాష్ట్రంలో చిన్నా చితకా డైరీలు చాలానే మూతపడ్డాయని సమాచారం. నిర్వహణ లోపం వల్ల రాజకీయ కారణాలతో కొన్ని డైరీలు మూతపడిపోయాయి. ఇపుడు వాటికి పూర్వవైభం తీసుకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మూతపడిపోయిన వాటిని అమూల్ కు అప్పగించాలని నిర్ణయించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్నినాని చాలా స్పష్టగా మీడియాకు వివరించారు. మూతపడిన డైరీలను పునరుద్ధరణలో భాగంగా అమూల్ కు అప్పగించబోతున్నట్లు ఇంత స్పష్టంగా చెప్పినా టీడీపీ మీడియా మాత్రం ఏపీ డెయిరీ ఆస్తులను లీజుకు అమూల్ కు అప్పగించేస్తున్నారని ఉద్దేశ్యపూర్వకంగానే రాశాయి. ప్రభుత్వంమీద కోపముంటే తీర్చుకోవచ్చు కానీ ప్రెస్ మీట్ లో చెప్పినదాన్ని కూడా వక్రీకరించి రాశారంటే జగన్ పై ఎంత అక్కసుందో అర్ధమైపోతోంది.

దీనిపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. నిజాల‌ను దాచి అవాస్త‌వాల‌ను చెబుతుండ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మీడియా క‌థ‌నాల‌ను, వాస్తవాల‌ను చూపుతూ జ‌గ‌న్ పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న తీరును కొంద‌రు బ‌హిర్గ‌తం చేస్తున్నారు. ఇటువంటి ప్ర‌చారం ద్వారా త‌మ‌కు న‌చ్చ‌ని వ్య‌క్తిపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కేశామ‌న్న స్వ‌యంతృప్తి పొందేసినా ప్ర‌జ‌ల్లో చుల‌క‌న చేస్తుంద‌న్న విష‌యాన్ని వారు గుర్తిస్తే మంచిదేమో!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp