గురుమూర్తికి విజయ హారతి.. తిరుపతిలో నిశ్శబ్ద విప్లవం

By Ramana.Damara Singh Apr. 08, 2021, 01:00 pm IST
గురుమూర్తికి విజయ హారతి.. తిరుపతిలో నిశ్శబ్ద విప్లవం

తిరుపతి ఉప ఎన్నిక పోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ప్రజల నుంచి లభిస్తున్న ఆధారాభిమానాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయాలకు, ఎన్నికలకు పూర్తీగా కొత్త అయిన ఈ వైద్యుడిపై ప్రజల్లో పూర్తి సానుకూలత కనిపిస్తోంది. స్వతహాగా సౌమ్యుడు, మృదు స్వభావి అయిన గురుమూర్తి.. మిగతా పార్టీల అభ్యర్థులకు భిన్నంగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.

ఆర్భాటాలకు దూరంగా.. ప్రభుత్వ పథకాలే ఆలంబనగా..

ఫిజియోతెరపిస్టుగా ఎంతో పేరున్న గురుమూర్తి రాజకీయ వైద్యుడిగా మారి సమాజానికి సేవా వైద్యం చేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం వైఎస్ జగన్ ప్రోద్బలంతో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన మిగతా అభ్యర్థుల హంగు ఆర్భాటాలకు పోవడంలేదు. ప్రచార విన్యాసాలు చేయడంలేదు. పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తున్నారు. అనవసమైన అంశాలు ప్రస్తావించకుండా.. ప్రసంగాలు చేయకుండా.. సూటిగా, క్లుప్తంగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనూలు, తనను గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నారా వివరించి ఓట్లు ఆర్థిస్తున్నారు. వాగ్దానాలు కాకుండా వాస్తవాలు భేరీజు వేసుకొని ఓట్లు వేయాలని కోరుతున్నారు. ప్రచారంలో గురుమూర్తి నిరాడంబరత, ఆయన మాటల్లోనే ముక్కుసూటితనం ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

పార్టీ అండతో ప్రాణాళికాబద్ద ప్రచారం

రాజకీయాలకు గురుమూర్తి కొత్తయినా.. పార్టీ శ్రేణులు ఆయనకు అండగా నిలుస్తున్నాయి. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ మంత్రులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులను ఇంచార్జిలుగా నియమించారు. స్థానిక ఎమ్మెల్యేల సమన్వయంతో వారు ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

అత్యధిక మెజార్టీయే లక్ష్యం

గత ఎన్నికల అనుభవాలు టీడీపీకి ఇక్కడ అవకాశాలు తక్కువని చెబుతున్నాయి. ఇటీవలి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, గత ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మీ మళ్లీ ఇక్కడ పోటీకి తొలుత విముఖత చూపడం..అధినేత ఒత్తిడితో ఆలస్యంగా బరిలోకి దిగడం వంటి పరిణామాలు ఆ పార్టీకి మైనస్ గా ఉన్నాయి. రెండో స్థానం కోసం టీడీపీతో పోటీ పడుతున్న బీజేపీకి గెలిచే సీన్ లేకపోవడంతో వైఎస్సార్సీపీ విజయానికి ఢోకాలేని పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికల్లో సాధించిన దానికంటే ఎక్కువ మెజార్టీ సాధనపైనే పార్టీ దృష్టి సారించింది.

Also Read : ఎవరీ గురుమూర్తి , తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ టికెట్ ఖాయమేనా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp