జ‌గ‌న్‌కు న‌వ‌ర‌త్నాలను అందించిన విజ‌య‌న‌గ‌రం

By Suresh May. 23, 2020, 02:58 pm IST
జ‌గ‌న్‌కు న‌వ‌ర‌త్నాలను అందించిన విజ‌య‌న‌గ‌రం

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నేతృత్వంలోని వైసిపి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు నాలుగు. అందులో విజ‌య‌న‌గ‌రం ఒక‌టి. తొమ్మిది స్థానాల‌కు తొమ్మిది వైసిపి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. దీంతో జ‌గ‌న్ కు విజ‌య‌న‌గరం న‌వ‌ర‌త్నాల‌ను అందించిందని చెప్పాలి.

స‌రిగ్గా ఏడాది క్రితం ఇదే రోజులు రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు సంభ‌వించాయి. 2019 అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన ఫ‌లితాలు మే 23నే అంటే స‌రిగ్గా ఇదే తేదిన వెలువ‌డ్డాయి. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) 151 స్థానాల‌తో చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వమ‌ని నిరంత‌రం డ‌బ్బ‌లు కొట్టే చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి కేవ‌లం 23 స్థానాల‌తో భారీ ఓట‌మిని చ‌వి చూసింది. అందుకు కార‌ణంగా కూడా లేక‌పోలేదు...ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఎనిమిదేళ్లు ప్ర‌తి రోజూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోనే ఉన్నాడు..ప్ర‌జ‌ల్లోనే బ‌తికాడు. ఆయ‌నను క‌క్ష పూరితంగా జైల్లో పెడితే, ఆయ‌న చెల్లి ష‌ర్మిలా జ‌గ‌న‌న్న ఒదిలిన బాణాన్ని అంటూ ప్ర‌జా క్షేత్రంలోకి వ‌చ్చింది. జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ కూడా ప్ర‌జ‌ల్లోనే ఉండేది. ఇలా ఆ కుటుంబం మొత్తం ప్ర‌జా సేవ‌లోనే ప‌రిత‌పించేవారు. అందుక‌నే ప్ర‌జ‌లు కూడా త‌మ‌లో ఒక‌రిగా జ‌గ‌న్‌ను ఆద‌రించారు. విశ్వ‌స‌నీయ‌త‌కు, విలువ‌ల‌కు ప‌ట్టం క‌ట్టారు.

మ‌రోవైపు నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ శేఖ‌ర్ రెడ్డి అకాల మృతి త‌రువాత చంద్ర‌బాబు విర్ర‌వీగిపోయాడు. నాడు ముఖ్య‌మంత్రులుగా ఉన్న నేత‌లతో లాలూచీ వ్య‌వ‌హారాలు న‌డిపాడు. జ‌గ‌న్ నేతృత్వంలోని ప్ర‌తిప‌క్షం నాటి ప్ర‌భుత్వంపై విశ్వాస ప‌రీక్ష పెడితే, ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు అధికార ప‌క్షానికి కొమ్ముకాశారు. త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న...ఎన్నిక‌లు రానేవ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో (2014) చంద్ర‌బాబు రాష్ట్రానికి అది చేసేస్తా..ఇది చేసేస్తా..ప‌ది హేనేళ్లు ప్ర‌త్యేక హోదా తెప్పించేస్తా..అంటూ ఢాంబాకాలు వ‌దిలి ప్ర‌చారం చేయ‌డంతో పాపం ప్ర‌జ‌లు న‌మ్మారు. అయిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక శాతం ఓట్ల‌తో గ‌ట్టేక్కాడు.

అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఆయ‌న ఇచ్చిన ఏ హామీ నెర‌వేర్చ‌లేదు. ఐదు కోట్ల ఆంధ్రుల హ‌క్కైన ప్ర‌త్యేక హోదాను కేంద్రానికి తాక‌ట్టు పెట్టి...చంద్ర‌బాబు వ‌ర్గం పంచుకోవ‌డానికి ప్యాకేజీ ఇప్పించుకున్నాడు. ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికొదిలేశాడు. రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు, యువ‌త‌కు మ‌నోభావాల‌ను ధిక్క‌రించాడు. ఇది ఇలా ఉండ‌గా త‌న ప్ర‌భుత్వంపైకి ఏదో ప్ర‌మాదం వ‌చ్చి ప‌డిన‌ట్లు...23 మంది ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేశాడు. రాష్ట్రంలో ఏక‌చ‌క్రాధిప‌త్యాన్ని ఏలాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఈ వ్య‌వ‌హారాల‌న్ని ప‌సిగ‌ట్టిన రాష్ట్ర ప్ర‌జ‌లు 2019 మే 23న దిమ్మ‌తిరిగే షాక్‌ను ఇచ్చారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్మని చంద్ర‌బాబును...ప్ర‌జ‌లు కూడా న‌మ్మలేదు. దీంతో ఆయ‌న ఎంత మంది ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేశాడో...స‌రిగ్గా అంత మందే గెలిచారు. దీంతో చంద్ర‌బాబు ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది.

ఇది ఇలాంటి ఉంటే ఆ ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చంద్ర‌బాబు పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. టిడిపి జిల్లాలో ఖాతా తెర‌వ‌లేదు. వాస్త‌వానికి విజ‌య‌న‌గ‌రం జిల్లా టిడిపికి కంచుకోట‌. ప్ర‌తి ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయ‌మైన సీట్లు..ఓట్లు వ‌చ్చేవి. అలాంటి జిల్లా చంద్ర‌బాబు వైఖ‌రితో విసుగుచెంది...ఒక ఎమ్మెల్యేను కూడా గెలిపించ‌లేదు. తొమ్మిది స్థానాల‌కు తొమ్మిది వైసిపినే గెలిచింది. విజ‌య‌న‌గ‌రంతో మూడు పార్ల‌మెంట్ స్థానాల‌కు సంబంధం ఉంది. ఆ మూడు పార్ల‌మెంట్ స్థానాల‌ను కూడా వైసిపినే గెలుచుకుంది. అయితే గ‌తంలో ఏ ఎన్నికల్లో జ‌ర‌గ‌ని ఒక విచిత్ర సంఘ‌ట‌న ఈ ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంది. గ‌తంలో జిల్లాలో ఉండే రాజులు కొంత మంది తెలుగుదేశం, మ‌రికొంత మంది కాంగ్రెస్ లో ఉండేవారు. జిల్లాలో రాజుల హ‌వా కూడా ఎక్కువ‌గానే ఉండేది. అయితే ఈసారి ఆ పార్టీ..ఈ పార్టీలో ఉండే రాజులంతా టిడిపి పంజ‌రంలోకి చేరారు. గుంప‌గుత్తిగా టిక్క‌ట్లైన్ని వాళ్లే తీసుకున్నారు. అంద‌రూ ప‌రాజ‌యం పాలైయ్యారు.

విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టిడిపి త‌ర‌పున పోటీ చేసిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు, వైసిపి అభ్య‌ర్థి కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మీద ఓట‌మి చెందింది. బొబ్బిలి స్థానం నుంచి టిడిపి త‌ర‌పున పోటీ చేసిన బొబ్బిలి రాజు సుజ‌య్ కృష్ణ రంగారావు, వైసిపి అభ్య‌ర్థి శంబంగి అప్ప‌ల‌నాయుడు మీద ఓట‌మి చ‌విచూశాడు. ఈయ‌న వైసిపిలో గెలిచి, త‌రువాత టిడిపిలో చేరి మంత్రి అయ్యారు. ఈ రాజు చేసిన మోసానికి ప్ర‌జ‌లు ఓడించారు. అలాగే రాజులై...గిరిజ‌నులుగా చెలామ‌ణి అవుతున్న సాలురూ టిడిపి అభ్య‌ర్థి ఆర్‌పి భంజ్‌దేవ్, వైసిపి అభ్య‌ర్థి పీడిక రాజ‌న్న‌దొరపైనా, కురుపాం టిడిపి అభ్య‌ర్థి పిరియా థాట్రాజ్, వైసిపి అభ్య‌ర్థి పుష్పా శ్రీవాణిపైనా ఓట‌మి చెందారు. ఈ పిరియా థాట్రాజ్ టిడిపి నేత శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు బంధువే. అలాగే విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ స్థానంలో టిడిపి త‌ర‌పున పోటీ చేసిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సామాన్య‌డైన వైసిపి అభ్య‌ర్థి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మీద ఓట‌మి చెందారు.

అలాగే అరుకు పార్ల‌మెంట్ స్థానానికి అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉండి ఎన్నిక‌ల ముందు టిడిపిలో చేరిన కిశోర్ చంద్ర‌దేవ్, వైసిపి అభ్య‌ర్థి సామాన్యురాలు మాధ‌విపై ఓట‌మి చెందారు. ఈయ‌న కూడా రాజే అయిన‌ప్ప‌టికీ..గిరిజ‌నుడుగా చ‌లామ‌ణి అవుతున్నాడు. ఇలా ఈసారి విజ‌య‌న‌గ‌రంలో రాజులంతా క‌ట్ట‌క‌ట్టుకొని ఓట‌మి చెందారు. చంద్ర‌బాబు మోసాలే వీరి ఓట‌మికి కార‌ణాలు. విజ‌య‌న‌గరం ఏర్పాడిన‌ప్ప‌టి నుండి తొలి సారి ఒక్క రాజు కూడా విజ‌య‌న‌గంలో గెల‌వ‌లేదు. టిడిపిని ఆ స్థాయికి ప్ర‌స్తుత నాయ‌కులు తీసుకొచ్చారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp