అలకబూనిన రాజేంద్రప్రసాద్

By Suresh 15-11-2019 07:36 PM
అలకబూనిన రాజేంద్రప్రసాద్

వల్లభనేని వంశీ,రాజేంద్రప్రసాద్ తిట్లపురాణంలో తనకు టీడీపీ అధిష్టానం నుంచి సరైన మద్దతుదక్కలేదని యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అలకబూనారు. నిన్న ఒక ఛానల్ లైవ్లో వంశీ తన మీద చేసిన ఆరోణలకు, ముఖ్యంగా పెనమలూరు టీడీపీ మాజీ MLA బోడే ప్రసాద్ వద్ద తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపించినా వంశీ ఆరోపణలను బోడె ప్రసాద్ ఖండించలేదని రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు.

కాంగ్రెస్ తో రాజకీయ జీవితం మొదలు పెట్టి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ కు దాదాపు 20 సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నా చంద్రబాబు రాజకీయ నైజం అర్ధంకాలేదు.ఎమ్మెల్యేలు ,మంత్రులు స్థాయి నాయకుల ఆమధ్య విబేధాలు వచ్చిన సందర్భాలలో కూడా చంద్రబాబు సర్దుబాటు ధోరణి తప్ప సమస్య పరిష్కారానికి ప్రయత్నించేవాడు కాదు.

కోడెల ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆయన ప్రభుత్వవేధింపులు అని రాజకీయ లబ్ది కోసం హడావుడి చేశాడు కానీ కోడెల గుండెపోటుతో గుంటూరు ఆసుపత్రిలో పదిరోజులు ఉన్నా,చంద్రబాబు గుంటూరుకు వెళ్లి కూడా ఆసుపత్రికి వెళ్లి కోడెలను పరామర్శించలేదు. తన భర్తను చంపించాడని ఆరోపణలు చేసిన పరిటాల సునీత మాటను పట్టించుకోకుండా జేసీ దివాకర్ రెడ్డికి ఎంపీ టికెట్,ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఆవిడ పడ్డ బాధ ముందు కేవలం తిట్టినందుకే తనకు మద్దతుగా నిలబడలేదని బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ బాధ ఏస్థాయిది?భూమా నాగిరెడ్డి-కేఈ కృష్ణమూర్తి,ఎర్రం నాయుడు-తమ్మినేని సీతారాం,దేవినేని ఉమా- కొడాలి నాని ,కేశినేని నాని - బుద్ధా వెంకన్న, సుబ్బారాయుడు-కోటగిరి విద్యాధర రావు, కోడెల శివప్రసాద్-మాకినేని పెద్దరత్తయ్య , సోమిరెడ్డి-ఆదాల ప్రభాకర్ రెడ్డి-నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి... ఇలా చెప్పుకుంటూ పొతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో వర్గ రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహించారు. అందుకే ఎక్కువమంది సీనియర్ నాయకులు ప్రజారాజ్యం,వైసీపీఏర్పడ్డప్పుడు ఆ పార్టలలోకి వెళ్లారు.

బయటకు పోయినా ఒక తలుపు ఎప్పుడు తెరిచి ఉంచే ధోరణి చంద్రబాబుది.రాజేంద్రప్రసాద్ కు ఈ రాజకీయం తెలియక వ్యక్తిగత స్థాయిలో వంశీతో ఢీకొట్టాడు. వంశీ కూడా అదుపు తప్పి వ్యక్తిగత విమర్శలు దిగటం ఆయనకు నష్టం చేస్తుంది,రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న చెడు సంస్కృతిని పెంచుతుంది. పార్టీకి రాజీనామా చేసిన తరువాత హుందాగా వ్యహరించటం రాజకీయ నాయకులకు మంచిది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News