సొంత ఊరి వారే పట్టించుకోలేదు... తిరుపతి ఓటర్లు స్పందిస్తారా యనమలా..?

By Voleti Divakar Apr. 17, 2021, 12:30 pm IST
సొంత ఊరి వారే పట్టించుకోలేదు... తిరుపతి ఓటర్లు స్పందిస్తారా యనమలా..?

టిడిపి మేధావి, సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చాలా అరుదుగా మాత్రమే స్పందిస్తారు. అదీ ముఖ్యమైన అంశాలపై మాత్రమే. తాజాగా మళ్లీ స్పందించారు. ఈ సారి తిరుపతి ఉప ఎన్నికల్లో అక్కడి ఓటర్లకు తన అమూల్యమైన సందేశాన్ని ప్రకటన రూపంలో అందించారు. తిరుపతి సాక్షిగా అధికార వైసిపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

యనమల టిడిపిలో తనకు తాను ఓ మేధావిగా భావిస్తుంటారని కింది స్థాయి కార్యకర్తలు ఎద్దేవా చేస్తుంటారు. ఆర్థిక, ఇతర అంశాలపై ఆయన అరుదుగా ప్రకటనల రూపంలో తన అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. వాటిని తెలుగుదేశం మీడియా ప్రముఖంగా వెలుగులోకి తెస్తుంది .
సొంత నియోజకవర్గం ఓటర్లే పట్టించుకోలేదు..

యనమల పిలుపును ఆయన సొంత నియోజవర్గం తుని ప్రజలే పట్టించుకోలేదు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాం నుంచి 2004 వరకు తుని నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల ఆ తరువాత గెలవలేకపోయారు. ఆయన సోదరుడు కృష్ణుడు కూడా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

కొడిగట్టిన ప్రాభవం.. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004లో తుని మున్సిపాలిటీలోని మొత్తం 30 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ప్రాభవం తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. తుని నియోజకవర్గం యనమల, ఆయన సోదరుడు కృష్ణుడికి పెట్టని కోటగా ఉండేది. మున్సిపాలిటీలో ఓటమి తరువాత నుంచి యనమల ఒక్కసారి కూడా నియోజకవర్గంలో గెలుపు ముఖం చూడలేదు. 

మొన్న పంచాయితీ ఎన్నికల్లో యనమల సొంత గ్రామం ఎవి నగరంలో కూడా వైసిపి విజయం సాధించింది. తుని మున్సిపాలిటీ లోని 30 వార్డులను మరో సారి వైసిపి తన ఖాతా లో వేసుకుంది. ఈ నేపథ్యంలో యనమల ప్రత్యక్ష రాజకీయ జీవితానికి తెరపడినట్లేనన్నభావన వ్యక్తమవుతోంది. ఆయన ఇక పత్రికా ప్రకటనలకే పరిమితం కావాల్సి వచ్చింది. పెద్దల సభలో సభ్యుడు గా ఉన్న యనమల అప్పుడప్పుడు ఇలా పత్రిక ప్రకటనలు ఇస్తూ కాలం గడుపుతున్నారు.

Also Read : తిరుప‌తిలో ప‌ర‌ప‌తి ద‌క్కించుకునేవారెవ‌రు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp