జ‌గ‌న్ కు మ‌హిళ‌ల నీరాజ‌నం : దేవుడిచ్చిన అన్న అంటూ కృత‌జ్ఞ‌త‌లు

By Kalyan.S Aug. 12, 2020, 06:11 pm IST
జ‌గ‌న్ కు మ‌హిళ‌ల నీరాజ‌నం : దేవుడిచ్చిన అన్న అంటూ కృత‌జ్ఞ‌త‌లు

మా తెలుగు ప్ర‌జ‌లు ఎవ‌రి మీద అంత త్వ‌ర‌గా అభిమానం పెంచుకోరు.. ఒక్క‌సారి పెంచుకుంటే చ‌నిపోయే వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌రు. ఠాగూర్ సినిమాలోని ఈ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోంది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ చేస్తున్న స‌హాయానికి ప్ర‌జ‌లు ముఖ్యంగా మ‌హిళ‌లు గుండెల్లో గుడిక‌‌ట్టుకుంటున్నారు. త‌మ‌కు దేవుడిచ్చిన అన్న‌గా కొలుస్తున్నారు. అందుకు వీరి వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. బుధ‌వారం వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కం ప్రారంభించిన జ‌గ‌న్ మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున జమచేశారు. ఈ సందర్భంగా ఆయ‌న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల లబ్ధిదారులతో మాట్లాడారు. వారు చెప్పిన మాట‌ల‌కు జ‌గ‌న్ సైతం భావోద్వేగానికి గుర‌య్యారు.

పుట్టింటి వాళ్లు కూడా చేయ‌ని స‌హాయం చేస్తున్నారు..

‘‘కరోనా కష్టకాలంలో పుట్టింటి వాళ్లు కూడా చేయని సహాయాన్ని దేవుడిచ్చిన అన్నగా మీరు మాకు చేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది రాష్ట్రమంతటా లబ్దిపొందుతున్నారు, వాళ్లలో నేను ఒక లబ్ధిదారునైనందుకు ఎంతో సంతోషపడుతున్నాను. కేవలం ఇవే కాదు.. స్వతంత్రంగా జీవనోపాధి ఏర్పాటు చేసుకుని పెద్ద, పెద్ద సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ మార్కెటింగ్‌ ఎలా చేసుకోవాలో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి గడపకూ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా రూ.1000 పంపిణీ చేశారు. అవే మాకు పదివేలుగా ఆ రోజుల్లో ఉపయోగపడ్డాయి. అని ఒంగోలుకు చెంది ప‌ద్మావ‌తి త‌న జ‌గ‌న్ వ‌ల్ల త‌న కుటుంబానికి క‌లిగిన మేలు గుర్తు చేసుకుని ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మీలాంటి అన్న‌ద‌మ్ములుంటే ఏ లోటూ ఉండ‌దు..

‘‘మీ లాంటి అన్నదమ్ములు ఉంటే మాకు ఏ లోటూ ఉండదు. అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు, ముసలమ్మలు ప్రతి నోటంటా ఒకటే మాట జగనన్నా, జగనన్నా.. మీరు చేసే మంచి కార్యక్రమాలు వల్లే. మరలా మరలా మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా మిమ్మల్నే గెలిపించుకుంటాం. వైఎస్సార్‌ చేయూత పథకంలో నేను లబ్ధిదారును. చాలా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పటి నుంచో మేం వెనుకబడి ఉన్నాం. మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. రూ.18750 రూపాయలు మీరు మాకు ఇచ్చారు. నాలుగేళ్లకు రూ.75 వేలు ఇస్తున్నారు. నేను లోన్‌ తీసుకుని జెరాక్స్‌ మిషన్‌ తీసుకున్నాను. దాని మీద నెలకు రూ.3వేలు ఆదాయం వస్తుంది. పిండిమిల్లు పెట్టుకోవాలని చాలా కాలం నుంచి నా కోరిక, అయితే ఆర్ధిక స్ధోమత లేక అది అలాగే ఉండిపోయింది. ఇవాళ ఈ చేయూత పథకం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఎల్లవేలలా రుణపడి ఉంటానన్నా.* విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన విజ‌య‌మ్మ మాట ఇది.
మేమంతా మీకు కృతజ్ఞతగా ఉంటాం

అక్కాచెల్లెమ్మలకు నేను ఉన్నాను, నేను చేయూతనిస్తాను అని మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అంత మంది మహిళలు మనసుల్లో అన్నగా నిల్చిపోయినందుకు మేమంతా మీకు కృతజ్ఞతగా ఉంటాం. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నాకు వితంతు ఫించన్‌ రూ.2250 వస్తోంది. విజయలక్ష్మీ మహిళా సంఘంలో నేను సున్నా వడ్డీ కింద రూ.3700 తీసుకున్నాను. వచ్చే నెల 11న వైఎస్సార్‌ ఆసరా కింది నేను రూ.39900 తీసుకోబోతున్నాను. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది అన్నా. * అని అనంత‌ర‌పురం జిల్లా సిద్దరాంపురం, బుక్కరాయసముద్రం మండలానికి చెందిన లక్ష్మీ దేవి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

చెమ్మ‌గిళ్లుతున్న క‌ళ్లు..

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందిస్తున్న ఒక్కో సాయం ఏపీ లోని ఒక్కో కుటుంబానికి ఎంత‌లా ఉప‌యోగ‌ప‌డుతుందో ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఇలా వందలు, వేలు కాదు.. కోట్లాది మంది జ‌గ‌న్ ను త‌మ సొంత కుటుంబ స‌భ్యుడిలా ఆరాధిస్తున్నారు. వైఎస్ఆర్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ ఇలాంటి అభివృద్ధిని, ఆద‌ర‌ణ‌ను ప్ర‌జ‌లు చూసి ఉండ‌రు. అందుకేనోమో ఆనందంతో వాళ్ల క‌ళ్లు చెమ్మ‌గిల్లుతున్నాయి. వారి ఆప్యాయ‌త‌ను, ఆద‌ర‌ణ‌ను చూసి ఇటు జ‌గ‌న్ సైతం భావోద్వేగానికి గుర‌య్యారు. అక్కాజెళ్ల‌ళ్ల‌కు స‌హాయ‌ప‌డే శ‌క్తిని ఆ దేవుడు మ‌రింతగా ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp