రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి.. టీడీపీ లో చర్చ కొనసాగుతోంది..!

By Voleti Divakar Jun. 20, 2020, 10:15 am IST
రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి.. టీడీపీ లో చర్చ కొనసాగుతోంది..!

ఆంధ్రప్రదేశ్ లో రాజ్య సభ ఎన్నికలు ముగిశాయి. వైసిపి అభ్యర్థులు గెలిచారు. టిడిపి అభ్యర్థి వర్ల రామయ్య ఓడిపోయారు. ఇది ముందే అందరికి తెలిసిన విషయమే. ఐతే రాజ్య సభ ఎన్నికలపై టిడిపి లో చర్చ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్గ రామయ్యను బలిపశువును చేశారా? అవుననే అంటున్నారు పార్టీ వర్గాలు.

రాజ్యసభ సీటు కోసం తనను తాను మేధావిగా భావించే సీనియర్ టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. యనమల పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, పార్టీని చంద్రబాబునాయుడు హస్తగతం చేసుకున్న సంక్షోభ సమయంలో కీలకమైన స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు పరోక్షంగా చంద్రబాబునాయుడుకు సహకరించారని చెబుతారు. అలాంటి వ్యక్తిని కాదని వర్లకు సీటు కేటాయించడం వెనుక మతలబేమిటన్నది చర్చనీయాంశం. అయితే ఒకప్పుడు యనమల కూడా చంద్రబాబు బాధితుడేనన్నది పార్టీ వర్గాల వాదన. 

తుని నియోజకవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు స్థానిక ప్రజలకు దూరమై, రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు కూడా ఓటమిపాలయ్యారు. ఈ పరిణామాలతో యనమల క్రమంగా నియోజకవర్గానికి, జిల్లాకు దూరమయ్యారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనమలకు ఎమ్మెల్సీ పదవితో పాటు, ఆర్థికశాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఆయన కొన్నాళ్లుగా పెద్దల సభ రాజ్యసభపై కన్నేశారు.

ఆర్థిక మంత్రిగా యనమల అవ సరాన్ని గుర్తించిన చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఆయనను రాజ్యసభకు పంపలేదు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమిపాలు కావడంతో ఈసారి ఒక రాజ్యసభ సీటును కూడా దక్కించుకునే పరిస్థితుల్లో టిడిపి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఓడిపోయే సీటుకు వర్ల రామయ్యను ఎంపిక చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆయనకు ఎస్సీల పై చిత్త శుద్ధి ఉంటే గతంలోనే సీటును ఆశించి నామినేషన్ వేసేందుకు కూడా బయలుదేరిన వర్లను పక్కన పెట్టి కనకమేడల రవీంద్రకుమార్ ను ఎందుకు ఎంపిక చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు 2004,2009లో కూడా యనమల రాజ్యసభ సీటును ఆశించారు. పార్టీ బలంగా ఉన్నా యనమలకు మాత్రం సీటు దక్కలేదు. రాజకీయ వాడకంలో పిహెచ్ డి చేసిన చంద్రబాబునాయుడుకు ఎస్సీ, బిసిలంటే ప్రేమ లేదని, కేవలం ఓటు బ్యాంకుగానే ఆయన వారిని వినియోగించుకుంటారని పార్టీలోని ఆయా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp